వెంక‌టేష్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. గ‌గ్గోలు పెడుతున్న ఫ్యాన్స్‌!?

విక్టరీ వెంకటేష్ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. అదేంటంటే.. సినిమాలకు ఆయన బ్రేక్ ఇవ్వబోతున్నాడట. ఇప్పుడు ఈ విషయం పైనే ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది `నారప్ప`, `దృశ్యం 2` సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన వెంకటేష్.. ఈ ఏడాది `ఎఫ్3` తో వచ్చారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత వెంకటేష్ నుంచి కొత్త ప్రాజెక్ట్‌ల‌ అనౌన్స్మెంట్ ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా రాలేదు. ప్రస్తుతం ఆయ‌న‌ రానా దగ్గుబాటితో క‌లిసి ప్ర‌ముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కోసం `రానా నాయుడు` అనే వెబ్ సిరీస్ మాత్రమే చేస్తున్నారు.

ఇది మినహా ఆయన చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. అయితే వెంకటేష్ కావాలనే కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయడం లేదట. ఆయ‌న‌ కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యార‌ట‌. ఆధ్యాత్మిక సాధన నేపథ్యంలోనే వెంకటేష్ ఆ నిర్ణ‌యం తీసుకున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.

Share post:

Latest