తెలుగు సినీ పరిశ్రమలో మంచు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మంచు కుటుంబం నుంచి మంచు మనోజ్,మంచు విష్ణు, మంచు లక్ష్మి, మోహన్ బాబు అందరూ కూడా సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించారు. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం మంచు మనోజ్ ,భూమా మౌనికని త్వరలో వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. ఇక సినిమాలకి దాదాపుగా మంచు మనోజ్ కొన్ని సంవత్సరాలుగా దూరంగానే ఉంటున్నారు. ఈ విషయంపై ప్రముఖ డైరెక్టర్ జి నాగేశ్వర్‌రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.
నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నేను ఎక్కువగా నమ్మేది ప్రజెంటేషన్ ఆఫ్ మూడ్ అని తెలియజేశారు. కొత్త కథలు అంటే అందులో మీనింగ్ లేదని కూడా కామెంట్స్ చేయడం జరిగింది. ఈ జనరేషన్ కి ఎక్కువగా విజువల్ వండర్స్ కావాలని తెలియజేశారు. కొత్త కథ కాదని కొత్త ప్రజెంటేషన్ అవసరమని తెలియజేశారు. ప్రభాస్ అంటేనే ఒక కటౌట్ అని ఆయనను యానిమేషన్ హీరోలా చూపించడం కరెక్ట్ కాదని కూడా కామెంట్లు చేయడం జరిగింది. ఆదిపురుష్ గ్రాఫిక్స్ చేంజ్ చేసి సినిమాని విడుదల చేయాలని తెలియజేశారు. ప్రభాస్ ని ఇష్టపడేవారు ఆదిపురుష్ సినిమా టీజర్ నచ్చలేదని కూడా తెలిపారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో కామెడీ సినిమాలు పూర్తిగా తగ్గిపోయాయని తెలిపారు. మంచు విష్ణువుతో ఒక సినిమా చేయాలనుకుంటున్నానని తెలియజేశారు. మనోజ్‌తో అహం బ్రహ్మాస్త్రి ప్రాజెక్ట్ లేట్ కావడం వల్ల మిగతా ప్రాజెక్టుల పైన ఎక్కువగా దృష్టి పెట్టలేకపోయానని తెలియజేస్తున్నారు. మనోజ్ కొత్త కథలతో ఎంట్రీ ఇస్తారని తెలియజేశారు. మనోజ్ రాజకీయాల్లోకి వెళ్ళొచ్చని వెళితే తప్పేంటి అని కూడా తెలిపారు. అయితే రాజకీయాల వల్లే కాస్త సినిమాలలో నటించడం లేటు కావచ్చు అన్నట్లుగా తెలియజేశారు నాగేశ్వర్ రెడ్డి.