టార్గెట్ పులివెందుల..జగన్‌పై వ్యతిరేకత?

పులివెందుల నియోజకవర్గం అంటే వైఎస్సార్ ఫ్యామిలీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ వేరే వాళ్ళు గెలిచే అవకాశాలు ఏ మాత్రం లేవు. అయితే ఎప్పటినుంచో పులివెందులలో కాస్త ఓట్లు ఎక్కువ తెచ్చుకోవడానికి టీడీపీ కష్టపడుతూనే ఉంది. కానీ గత ఎన్నికల్లో మరీ దారుణంగా ఓడింది. దాదాపు 90 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ ఓడింది..ఇక జగన్ అద్భుతమైన విజయం సాధించారు.

నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ జగన్‌ని ఓడించడం జరిగే పని కాదు..ఆయన గెలుపు ఫిక్స్ అందులో డౌట్ లేదు..కాకపోతే మెజారిటీ మాత్రమే చూసుకోవాలి. గత మెజారిటీ కంటే తక్కువ వస్తుందా? లేక ఎక్కువ వస్తుందా? అనేది క్లారిటీ లేదు. అయితే తన సొంత స్థానం కుప్పంని జగన్ టార్గెట్ చేయడంతో చంద్రబాబు సైతం పులివెందులని టార్గెట్ చేశారు. కుప్పం సంగతి తర్వాత ముందు పులివెందులలో గెలుస్తారో లేదో చూసుకోవాలని చెప్పి జగన్‌కు వార్నింగ్ ఇస్తున్నారు.

ఇదే క్రమంలో తాజాగా పులివెందుల ఇంచార్జ్‌గా ఉన్న బీటెక్ రవి..చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో పులివెందులలో ఉండే రాజకీయ పరిస్తితులపై చర్చించారు.  పులివెందులలో గతం లో ఎన్నడూ లేని విధంగా టీడీపీకి విజయావకాశాలు ఉన్నాయని, జగన్‌పై తీవ్ర అసంతృప్తి ఉందని, దాన్ని మీరు ఉప యోగించుకోండని రవికి సూచించారు.

అలాగే పులివెందులలో గతంలో ఎన్నడూ లేని విధంగా జగనపై తీవ్ర వ్యతిరేకత ఉందని, వైఎస్‌ వివేకా హత్య, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గతంలో టీడీపీ చేసిన అభివృద్ధిని కూడా వివరించాలని తెలిపారు. అయితే చంద్రబాబు చెబుతున్నట్లు..పులివెందులలో జగన్‌పై వ్యతిరేకత కనిపిస్తుందా?అంటే అదేమీ లేదని చెప్పొచ్చు. అసలు పులివెందులలో టీడీపీ గెలుపు అనే మాట మర్చిపోవచ్చు. కాకపోతే జగన్ మెజారిటీ తగ్గించడంపై మాత్రం ఫోకస్ పెట్టవచ్చు. గతంలో 90 వేలు ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ మెజారిటీని తగ్గించే అవకాశాలు టీడీపీకి ఉన్నాయి. మరి మెజారిటీ తగ్గించడంలో బీటెక్ రవి ఎంతవరకు సఫలమవుతారో చూడాలి.