ఔను! తిరిగి తిరిగి.. పొత్తుల బంతి.. జనసేనాని పవన్ కళ్యాణ్ కోర్టులోకివచ్చి చేరింది. వచ్చే ఎన్నికల్లో తాము కలిసి పనిచేస్తామని.. తమ వ్యూహాలను అమలు చేస్తామని.. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి.. పవన్ ప్రకటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం .. తాము చేతులు కలుపుతున్నామని అన్నారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా సంచలనం ఏర్పడింది. ఇంకే ముంది.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు ఖాయమైందని అనుకున్నారు.
కట్ చేస్తే.. ఆ ప్రకటన తర్వాత.. ఇప్పటి వరకు చంద్రబాబు కానీ, పవన్ కానీ కలుసుకున్నది లేదు. మాట్లా డుకున్నది లేదు. ప్రజాస్వామ్యం.. పరిరక్షణ వంటి వి అసలే లేదు. ఈ నేపథ్యంలో అసలు జనసేన-టీడీపీ కలిసి ముందుకు సాగుతాయా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఇంతలోనే.. తాజాగా ఒకసంచలన విషయం వెలుగు చూసింది.
ఇటీవల ఏపీకి వచ్చిన ప్రధాని మోడీ.. పవన్‌కు భారీ క్లాస్ ఇచ్చారని.. దీనిలో కీలకమైన విషయం.. బీజేపీ.. ఎట్టిపరిస్థితిలోనూ టీడీపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదని.. కాబట్టి, నువ్వు మాతో ఉండాలంటే.. టీడీపీకి దూరంగా ఉండాలని.. మోడీ కుండబద్దలు కొట్టి చెప్పినట్టు తాజాగా వెలుగు చూసింది. బహుశ ఈ పరిణా మం తర్వాతే.. పవన్ ఎక్కడా కూడా.. టీడీపీ గురించిన ప్రస్తావన తీసుకురాకుండా.. తన సొంత వ్యవహారా లపైనే చర్చిస్తూ వచ్చారు.
నేరుగా వైసీపీతో తలపడతానని, ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అనడం వెనుక. వ్యూహం ఇదేనని అంటున్నారు పరిశీలకులు. అయితే.. ఏమీ లేని బీజేపీతో పవన్ అడుగులు వేయడం కంటే.. తనను తాను ఒంటరిగా నిలబెట్టుకునేందుకు ప్రయత్నించడం లేదా.. తాను ఏదైతే పొత్తు అనుకున్నారో.. ఆదిశగా అడుగులు వేయడం.. సరైన చర్య అని అంటున్నారు పరిశీలకులు. మరి పవన్ ఏం తేలుస్తారో చూడాలి.