ఆ నిర్ణయంతో అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చిన బాలయ్య..!!

తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు అల్లు అరవింద్. ఈ మధ్యకాలంలో నందమూరి నటసింహ బాలకృష్ణతో మంచి అనుబంధం ఏర్పడిందని చెప్పవచ్చు. ఇలా బాలయ్యతో అనుబంధం ఉన్న కారణంగానే గీత ఆర్ట్స్ బ్యానర్ లో బాలకృష్ణ తప్పకుండా ఒక సినిమా చేస్తారని వార్తలు ఈ మధ్యకాలంలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా అనంతరం మరొక డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయవలసి ఉంది.

Allu Aravind may announce a film with Balakrishna - TeluguBulletin.com

ఇకపోతే గీత ఆర్ట్స్ బ్యానర్ లో డైరెక్టర్ పరుశురాం ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మరొకసారి ఈ బ్యానర్ పై పరుశురాం బాలకృష్ణతో ఒక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే కేరాఫ్ కరచపాలెం అనే సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయమైన వెంకట్ మహా దర్శకత్వంలో ఒక చిత్రంలో బాలకృష్ణ నటించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ బాలయ్యకు కథను వినిపించగా బాలయ్య కేవలం పరుశురాం కథను తిరస్కరించి వెంకట ప్రభు కథను మెచ్చుకున్నట్లుగా సమాచారం. ఇక ఈయన చెప్పిన సినిమా కథలు మన నిజ జీవితానికి చాలా దగ్గరలో ఉంటాయని చెప్పవచ్చు. అందుచేతనే బాలయ్య కూడా ఈ సినిమాకి ఓకే చెప్పినట్లుగా అభిమానులు భావిస్తున్నారు.

పరశురాం దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో బాలకృష్ణ హీరోగా సినిమా చేయాలని భావించినప్పటికీ బాలకృష్ణ మాత్రం మరొక డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అల్లు అరవింద్ కి కాస్త షాక్ తగిలిందని చెప్పవచ్చు. అయితే బాలయ్య నటించబోతున్న ఈ చిత్రానికి వారాహి బ్యానర్ లో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అందుకు సంబంధించి అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం. మరి ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

Share post:

Latest