బాలయ్య అభిమానులకు షాక్… లీకైన “వీరసింహా రెడ్డి” సాంగ్?

నందమూరి అందగాడు బాలకృష్ణ గురించి తెలుగు జనాలకి పరిచయం అక్కర్లేదు. తాజాగా ఆయన హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న వీరసింహా రెడ్డి సినిమా విషయంలో లీకు వీరులు రెచ్చిపోతున్నారు. చిత్ర యూనిట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా ఏదోఒక విధంగా షూటింగ్ ఫోటోలు గాని, చిన్న చిన్న క్లిప్స్ గాని లీక్ అవుతున్నాయి. దాంతో నందమూరి అభిమానులు సదరు సినిమా యూనిట్ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. కేవలం ‘మైత్రి’ వారు నిర్మించే సినిమాలకే ఇలా ఎందుకు జరుగుతుంది అంటూ చాలా మంది అభిమానులు ప్రశ్నలు వేస్తున్నారు.

అవును, “వీరసింహా రెడ్డి” కి సంబంధించి ఆన్ లొకేషన్ పిక్స్ వంటివి కొన్ని రోజుల కిందటే లీక్ కావడం మనం చూసాం. అయితే ఇపుడు ఫొటోలే కాకుండా సాంగ్ వీడియోలు కూడా లీక్ అవుతున్నాయి. హీరో ఇంట్రడక్షన్ లాంటి “జై బాలయ్య” సాంగ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు కారణం ఈ సాంగ్ వీడియో రూపంలో లీక్ అవటమే. అదే సమయంలో థమన్ మరోసారి కాపీ ట్యూన్ కొట్టి దొరికేసాడు అనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఈ సాంగ్.. ఏ పాటను పోలి ఉందంటే… గతంలో విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన భారీ హిట్ చిత్రం ‘ఒసేయ్ రాములమ్మ” చిత్రం టైటిల్ సాంగ్ లా ఉంది.

ఇక అదే థమన్ గతంలో అఖండ చిత్రానికి సూపర్ డూపర్ మ్యూజిక్ ఇచ్చిన సంగతి తెలిసినదే. ఆ సినిమా సక్సెస్ లో థమన్ షేర్ ఉందనటంలో సందేహం లేదు. దాంతో ఈ మాస్ సినిమాలో కూడా థమన్ అదిరిపోయే పాటలు ఇస్తారని ఫ్యాన్స్ అనుకుంటుండగా ఇలా జరగడం దురదృష్టకరం అని కొందరు భావిస్తున్నారు. ఒరిజనల్ పాటలు ఇస్తే బాగుండును అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇది సినిమాతో పాటు పోటీగా రిలీజ్ అవుతున్న చిరంజివి ‘వాల్తేర్ వీరయ్య’నుంచి ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ సాంగ్ రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసినదే.

Share post:

Latest