బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలో హైలెట్ అదే.. ఫ్యాన్స్‌కి పూనకాలే..

నరసింహ నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలు తిరగరాసేలా ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇంతకుముందు సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి సినిమాలతో ప్రేక్షకుల చేత ఇలలు వేయించిన బాలకృష్ణ ఇప్పుడు వీర సింహ రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకి బాలయ్య ‘వీర సింహ రెడ్డి’గా తన నటనలోని విశ్వరూపం చూపించనున్నాడు. ఇక బాలయ్య మాస్ ఫ్యాన్స్ కూడా ఆయన సింహ గర్జన వినడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలయ్యని ఇంతకుముందు ఎన్నడూ చూడని మాస్ అవతార్‌లో చూపించబోతున్నాడు. వీర సింహ రెడ్డి టైటిల్‌కి తగ్గటుగా పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయట.

కాగా తాజాగా సోషల్ మీడియాలో ‘వీర సింహ రెడ్డి’ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్‌లో ఒక ట్విస్ట్ ఉంటుందట. అది వీర సింహ రెడ్డి సినిమాలోనే హైలెట్ సీన్ అవుతుందని సినీ వర్గాల్లో కొందరు చెప్తున్నారు. ఆ ట్విస్ట్ హీరో బాలకృష్ణ, హీరోయిన్ శృతి హాసన్ క్యారెక్టర్లకు సంబంధించిందని సమాచారం. సినిమా మొత్తానికి ఈ ట్విస్ట్ చాలా ఎమోషనల్, హైలెట్‌గా ఉండబోతుందట. దీన్ని చూస్తే ఫ్యాన్స్ కి పూనకాలేనట. దీన్నిబట్టి దర్శకుడు గోపీచంద్ ఈ ట్విస్ట్‌ని ఎంతో ఇంట్రెస్టింగ్‌గా చిత్రీకరించాడని తెలుస్తోంది.

ఒకవేళ ఈ సినిమా బాగుంటే సంక్రాంతి సందర్భంగా అత్యధిక వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఈ మూవీ ని రూ.70 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్నట్లు సమాచారం. ఇతర భాషల్లో కూడా దీనిని రిలీజ్ చేస్తే కాసుల వర్షం కురవడం ఖాయం.

Share post:

Latest