హీరోయిన్ రంభ కి యాక్సిడెంట్.. తృటిలో తప్పిన ప్రమాదం..!

తాజాగా సీనియర్ హీరోయిన్ నటి రంభ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు మంగళవారం ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో రంభతో పాటు ఆమె పిల్లలు అలాగే పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకునే ఆయా కూడా ఉన్నారు. దేవుడు దయ వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని రంభ తెలిపారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఆమె తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

 

Rambha Biography – Wiki, Real Name, Age, Height, Family, Movies, Marriage  Pics, DOB, Awards,etc.
అసలు విషయంలోకి వెళ్తే.. “పిల్లలను స్కూల్ నుంచి తీసుకువస్తుండగా ఇంటర్ సెక్షన్ దగ్గర మా కారును మరో కారును ఢీ కొట్టింది. అప్పుడు కారులో నాతోపాటు పిల్లలు, ఆయా ఉన్నారు. చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. మేమందరం సేఫ్ గా ఉన్నాము. చిన్నారి సాషా మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే ఉంది. త్వరగా కోలుకోవాలని మా కోసం దేవుడిని ప్రార్థించండి.. చిన్నారి త్వరగా కోలుకోవాలని కోరుకోండి.. మీ ప్రార్థనలు మాకు ఎంతో అవసరం” ..అంటూ రంభ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆస్పత్రిలో ఉన్న చిన్నారి ఫోటోతో పాటు కార్ యాక్సిడెంట్ కి గురైన ఫోటోలను రంభ షేర్ చేసింది.

అది ఎస్ యు వి కారు కావడంతో ఆక్సిడెంట్ అయిన వెంటనే ఎయిర్ బాగ్స్ ఓపెన్ అయినట్టు తెలుస్తోంది. అందువల్లే ఎవరికి పెద్దగా గాయాలు కాలేదు. కాకపోతే కారు డోర్స్ మాత్రం డామేజ్ అయ్యాయి. రంభ పోస్ట్ చూసి ఆడియన్స్ అందరూ షాక్ అయ్యారు. ఆవిడ త్వరగా కోలుకోవాలని మెసేజ్ , పోస్టులు కూడా పెడుతున్నారు. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రంభ మెగాస్టార్ చిరంజీవి తో బావగారు బాగున్నారా, నటసింహ బాలకృష్ణతో భైరవద్వీపం ,నాగార్జునతో హలో బ్రదర్, వెంకటేష్ తో ముద్దుల ప్రియుడు, జెడి చక్రవర్తి తో బొంబాయి ప్రియుడు ఇలా ఎన్నో సినిమాలలో.. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఆ తర్వాత తమిళ్, హిందీ సినిమాల్లో మాత్రమే కాదు భోజ్ పురి లో కూడా ఆరాధ్య దేవతగా గుర్తింపు తెచ్చుకుంది.

Khushboo slams reports on Rambha-Indran's divorce, says everything is fine  - IBTimes India
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరమై పిల్లలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవల కెనడాలోనే సెటిల్ అయినా రంభ గత కొన్ని రోజుల క్రితం చెన్నైకి వచ్చినప్పుడు.. సీనియర్ హీరోయిన్ లు, ఇండస్ట్రీలో తన స్నేహితులను కలిసి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.