ప్రజెంట్ నందమూరి ఫ్యాన్స్ ఎలాంటి జోష్ లో ఉన్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్గా ఎన్బికె 107 సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అందరూ అనుకున్నట్టే జై బాలయ్య అంటూ ఈ సాంగ్ దుమ్ము దులిపేస్తుంది . మరీ ముఖ్యంగా ఈ సాంగ్ ప్రజెంటేషన్ చాలా బాగుంది అంటూ విమర్శకుల సైతం ప్రశంసలతో ముంచేస్తున్నారు . బాలకృష్ణ ఫ్యాన్ బేస్ కి ఆయన కటౌట్ కి పర్ఫెక్ట్ డైరెక్షన్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని అంటూ ఓ రేంజ్ లో ఈ సినిమాను హైప్ చేస్తున్నాడు.
కాగా త్వరలోనే ఈ సినిమా ఆఖ షెడ్యూల్ పూర్తి చేసేసి నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో చేయబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది . మనకు తెలిసిందే గోపీచంద్ డైరెక్షన్లో బాలయ్య సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా సంక్రాంతి కానుకగా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది . కాగా ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే అనిల్ రావిపూడి తో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేశాడు బాలయ్య. అయితే అనిల్ రావిపూడి రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం బాలయ్య కొన్ని చేంజెస్ చెప్పారట. నిజానికి వీళ్ళిద్దరి మూవీ ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. స్క్రిప్ట్ మార్చమని అనిల్ రావిపూడి కి బాలయ్య ఎప్పుడో చెప్పాడు.
ఇప్పటివరకు దానిపై కాన్సన్ట్రేషన్ చేయనేలేదట. మరో నెల రోజుల్లో షూటింగ్ స్టార్ట్ చేయాలి అని బాలయ్య చెప్పినా కానీ అని ఆ సినిమా స్క్రిప్ట్ పై కాన్సన్ట్రేషన్ చేయకపోవడంపై బాలయ్య ఫైర్ అయినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు ప్రజెంట్ అనిల్ రావిపూడి ఆహాలో కామెడీ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్నాడు. మంచి టాక్ దూసుకుపోతున్న అనిల్ ను ఆహా బాగా వాడుకుంటుంది . ఈ క్రమంలోనే బాలయ్య సినిమాపై కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అనిల్ అన్న రూమర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఇలాంటి టైంలోనే బాలయ్య కూడా అనిల్ రావిపూడి కి వార్నింగ్ ఇచ్చారని ..త్వరగా స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలని హెచ్చరించారని తెలుస్తుంది. ఇది అనిల్ రావిపూడి కెరీర్ కు బిగ్గెస్ట్ నెగటివ్ పాయింట్ గా మారిందని జనాలు అంటున్నారు. చూడాలి మరి అనిల్ రావిపూడి బాలయ్య కోపాన్ని ఏ విధంగా కూల్ చేస్తాడు ఎలాంటి హిట్ ఇస్తాడో..?