పూజా హెగ్డే ను వెంటాడుతున్న బ్యాడ్ టైమ్..!!l

నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం సౌత్ ఇండియా ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండియా ఇండస్ట్రీలో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది ఈ బుట్ట బొమ్మ. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలలో నటిస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంది. అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ తో సహా మరి ఎంతో మంది స్టార్ హీరోలు సరసన నటించింది. కానీ అమ్మడి మెరుపులు ఎంతో కాలం కొనసాగలేదు. ప్రస్తుతం ట్రాక్ చూస్తే చాలా బ్యాడ్ టైం నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క సక్సెస్ కూడా అందుకోలేదు. ఇదే ఏడాది మూడు సినిమాలు రిలీజ్ చేసినా కూడా వాటిలో ఒక్క విజయం కూడా లేకపోవడం గమనార్హం.

Pooja Hegde Photos [HD]: Latest Images, Pictures, Stills of Pooja Hegde -  FilmiBeat

ఈ ఏడాది ప్రారంభంలో భారీ అంచనాలతో విడుదలైన పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ డిజాస్టర్ గా మిగిలిన విషయం తెలిసిందే. ఆ తరువాత విజయ్ సరసన బీస్ట్ సినిమా రిలీజ్ అయింది . అది కూడా డిజాస్టర్ . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడిగా నటించిన ఆచార్య సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలింది. పూజ కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిన చిత్రం ఇది.ఇక ఎఫ్ త్రీ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించినప్పటికీ అది కేవలం యావరేజ్ గానే ఆడింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన జనగణమన సినిమాలో నటించాల్సి ఉండగా ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.

Pooja Hegde Opens Up About Lowest Phase of Her Career: 'There Was a Year I  Didn't Have Work'

ఇలా వరుసగా డిజాస్టర్ లు వెలువడటంతో పూజా పై ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడిపోయింది. రిలీజ్ అయిన సినిమా ఫలితాలు గతం అనుకుంటే షూటింగ్ మధ్యలో సినిమా రద్దవ్వడం కూడా సెంటిమెంటును హైలైట్ చేస్తోంది. ఇప్పుడు ఈమె చేతిలో కొన్ని హిందీ సినిమాలు అలాగే మహేష్ బాబు 28వ చిత్రం తప్ప మరేవీ లేవు . ఇప్పుడు ఒత్తిడిని జయించేందుకు లోకేషన్ మూడ్ లోకి వెళ్లిపోయింది. 2023 లోకి అడుగుపెట్టాకైనా ఈమెకు అవకాశాలు వస్తాయో తెలియాల్సి ఉంది.

Share post:

Latest