కాబోయే భర్తతో యాపిల్ బ్యూటీ.. మంచి సౌండ్ పార్టీనే పట్టిందే..ఫోటోలు వైరల్ ..!!

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన `దేశముదురు` సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది హన్సిక మోత్వాని. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ను అందుకున్న హన్సిక ఆ తరువాత.. ఎన్టీఆర్ తో `కంత్రి`, ప్రభాస్ తో `బిల్లా`, రామ్ తో `కందిరీగ`, `మస్కా` అలాగే రవితేజ తో `పవర్` వంటి సినిమాలలో నటించి మంచి స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది.

అంతేకాకుండా తమిళంలో కూడా వరుస‌ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి స్టార్ డం ను దక్కించుకుంది. అయితే అక్కడి ప్రేక్షకులు హన్సికను జూనియర్ కుష్బూగా భావించి ఆమెకు గుడి కూడా కట్టేశారు.. అయితే గత కొన్ని రోజులుగా హన్సిక పెళ్లి విషయంపై చాలానే వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలపై స్పందిస్తూ హన్సిక అది నిజమే అంటూ ఆంగ్ల మీడియాకు క్లారిటీ ఇచ్చింది.

అయితే అతనికి కాబోయే భర్త ప్రముఖ వ్యాపారవేత్త సోహెల్ కతూరియా. అయితే సోహెల్ సోదరి హన్సికాకు చిన్నప్పటినుండి మంచి మిత్రురాలట. అలా మొదటి నుంచి వీరు కూడా మిత్రులలా కలిసి చాలా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారట.

ఇక ఈ క్రమంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారని సమాచారం. అయితే డిసెంబర్ 4వ తేదీన జైపూర్ లోని ముండోటా ప్యాలెస్ లో హన్సిక పెళ్లి జరగనుందని వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరికీ సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నేటిజన్లు మంచి సౌండ్ పార్టీ నే పట్టిందే ఆపిల్ బ్యూటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.అయితే హన్సిక పెళ్లికి సంబంధించి ఇప్పటికే ప్రిపరేషన్స్ మొదలవుతున్నాయని.. అంతేకాకుండా పెళ్లి కోసం స్టార్ హోటల్స్ కూడా బుక్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పెళ్లికి మాత్రం ఇండస్ట్రీలో ఎవరికి చెప్పకుండా కేవలం పరిమిత కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకుంటుందని సమాచారం.

Share post:

Latest