అనుప‌మ కొత్త వ్యాపారం.. న‌చ్చ‌దు అంటూనే అలా చేస్తుంది!

అనుపమ పరమేశ్వరన్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మలయాళం లో సినీ కెరీర్‌ ప్రారంభించిన ఈ బ్యూటీ.. `అ ఆ` సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. `శతమానం భవతి` సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ఈ అమ్మడికి మ‌ధ్య‌లో వ‌రుస‌ ప్లాపులు ఎదురైనప్పటికీ.. ఇటీవల విడుద‌లైన‌ కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ నుఖాతాలో వేసుకుంది.

అదే స‌మ‌యంలో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం `కార్తికేయ 2` ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న అనుపమ.. తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టింది. అలాగే తాజాగా ఈ బ్యూటీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. అదేంటంటే అనుపమ సోషల్ మీడియాలో వ్లాగ్స్ చేయడం ప్రారంభించింది. ఇటీవల స్టార్ సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ వ్లాగ్ వీడియోల ద్వారా రెండు చేతుల సంపాదిస్తున్నారు.

ఇప్పుడు అనుప‌మ కూడా రంగంలోకి దిగింది. అయితే గతంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తనకు నచ్చద‌ని చెప్పింది. కానీ నచ్చదు అంటూనే గ‌త‌ కొద్ది రోజుల నుంచి అనుపమ సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ అయిపోయింది. అదిరిపోయే ఫోటోషూట్లతో తన ఫాలోయింగ్ ను అంతకు అంతకు పెంచుకుంటుంది. ఇక తాజాగా అనుప‌మ ఓ సాంగ్ షూట్ కోసం పోలెండ్ కు వెళ్లిపోయింది. అక్క‌డ షూటింగ్ గ్యాప్ లో ఓ వ్లాగ్ వీడియో చేసేసి యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది.

Share post:

Latest