అనుపమ పరమేశ్వరన్.. మలయాళం లో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ కేరళ కుట్టి `అ ఆ` సినిమాతో తెలుగు తెలుగు పరిచయం అయింది. ఈ సినిమాలో అనుపమ మెయిన్ హీరోయిన్ కాకపోయినా.. ఆమెకు మంచి గుర్తింపు దక్కింది.
ఈ సినిమా తర్వాత అనుపమకు టాలీవుడ్ నుంచి ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే వరస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న ఈ ముద్దుగుమ్మ.. రీసెంట్ గా `కార్తికేయ 2` మూవీతో ప్రేక్షకులను పలకరించింది.
నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సంచలన విషయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్ లోకి వచ్చిన అనుపమ.. త్వరలోనే `18 పేజెస్` సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.
అలాగే యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డతో `డీజే టిల్లు 2` సినిమాలో నటించబోతోంది. వీటితోపాటు మరిన్ని ప్రాజెక్ట్స్ సైతం అనుపమ చేతిలో ఉన్నాయి. ఇలా ఉంటే.. ఇటీవల అనుపమ సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ అయింది.
కెరీర్ ఆరంభం నుంచి ఎక్స్పోజింగ్ కు దూరంగా ఉంటూ వచ్చిన అనుపమ.. ఇటీవల హద్దులు చెరిపేస్తూ అందాలను ఆరబోస్తోంది. తాజాగా కూడా తన అందాలతో మిస్మరైస్ చేసే ప్రయత్నం చేసింది.
స్లీవ్ లెస్ మినీ టాప్ ను ధరించిన అనుపమ.. నాజూకు నడుమును చూపిస్తూ కర్లీ హెయిర్లో క్యూట్ క్యూట్ గా ఫోటోలు కు పోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.