అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చిన అనసూయ..ప్రత్యేక పూజలు దాని కోసమేనా..!

టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉంటూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె చేతిలో పలు స్టార్ హీరోల సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల తో పాటు పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ తన కెరీర్ లో పీక్ స్టేజ్‌లో అనసూయ దూసుకుపోతుంది. ఈ విషయాలన్నీ ఎలా ఉన్నా అనసూయ తాజాగా తన సోషల్ మీడియా ఎకౌంట్లో తను రోజు చేసే పోస్టులకు భిన్నంగా ప్రత్యేకమైన వీడియోను షేర్ చేసింది.

ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో అనసూయ తన భర్తతో కలిసి యజ్ఞ యాగాలు, ప్రత్యేక క్రతువులు పూజలు నిర్వహిస్తున్నారు. అనసూయ ఈ పూజలు చేయడానికి కారణం ఏంటని నెటిజన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అనసూయ తన గురించి ప్రతి విషయం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తను షేర్ చేసే ప్రతి విషయానికి.. తనకు సంబంధించిన పూర్తి మేటర్ ను ఆ పోస్ట్‌ కింద అనసూయ రాసుకొస్తుంది. ఇప్పుడు అనసూయ షేర్ చేసిన వీడియో కింద మాత్రం‘సర్వేజనా సుఖినోభవంతు’ అని ఒక కామెంట్ మాత్రమే ఇచ్చింది.

అనసూయ ఇంత శ్రద్ధగా పూజ చేయడానికి అదే కారణం అంటూ నెటిజెన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అనసూయ ఈ పూజలు చేయడానికి ప్రత్యేక కారణం తన సినీ కెరియర్‌లో ఇంకా ముందుకు వెళ్లాలని యజ్ఞం చేసిందని తెలుస్తుంది. అనసూయ ఈ పూజలు తర్వాత ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)