అల్లు అర్జున్ సినిమాను ఎగరేసుకుపోయిన రామ్.. ఏం ట్విస్ట్ ఇచ్చాడు రా బాబు..!

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత పుష్ప2 సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్‌గా మొదలైంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్‌ తర్వాత సినిమాలపై ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. అల్లు అర్జున్ మాస్ దర్శకుడు బోయపాటి కాంబోలో సరైనోడు సినిమా వచ్చి అల్లుఅర్జున్ కెరియర్ లోనే అదిరిపోయే మాస్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ 100 కోట్ల క్లబ్ లో చేరాడు.

4 Years for Sarrainodu: Take a trip down memory lane with pictures from the  shoot | Telugu Movie News - Times of India

ఈ సినిమా అల్లు అర్జున్ కెరియర్ లోనే భారీ వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. తర్వాత ఈ కాంబో మళ్లీ రిపీట్ అవుతుందని అందరూ భావించారు. బోయపాటి శ్రీను కూడా అల్లు అర్జున్‌లో మరో సినిమా చేయడానికిి ట్రై చేసాడు. అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్‌తో వినయ విధేయయ రామ తీసి భారీ ప్లాఫ్ అందుకున్నాడు. ఇక దీంతో అల్లు అర్జున్ కూడా ఆ సినిమా ప్లాఫ్ అవడంతో ఆగిపోయాడని టాక్ కూడా వచ్చింది. బోయపాటి మళ్ళీ బాలకృష్ణతో ఆఖండ సినిమాతో తన టాలెంట్ ని మళ్ళీ ప్రూవ్ చేసుకుని భారీ విజయం అందుకున్నాడు. బాలకృష్ణకు తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు.

Allu Arjun's Fans Worried About Director Jinx!

సినిమా తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ తో పాన్ ఇండియా లెవెల్ లో భారీ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు బోయపాటి. ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్ గా మొదలైంది. ఇక ఇందులో రామ్‌కు జోడిగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీ లీల కన్ఫర్మ్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఇక ఈ సినిమా క‌థ‌ను ముందుగా బోయపాటి అల్లు అర్జున్ కు చెప్పాడట. అల్లు అర్జున్ కూడా ఈ కథ నచ్చడంతో సినిమాకు ఓకే చెప్పాడని తెలుస్తుంది. ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్లు సర్దుబాటు అవ్వకపోవడంతో.. అల్లు అర్జున్ ఈ సినిమాకు నో చెప్పాడట.

Ram Pothineni Teams Up With Director Boyapati Sreenu for His 20th Film!  (View Pic) | 🎥 LatestLY

తర్వాత బోయపాటి అదే స్టోరీని రామ్ కి చెప్పగా స్టోరీ నచ్చడంతో సినిమాకు సంబంధించిన డేట్లు ఇచ్చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ జరుగుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం రామ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేయబోతున్నాడని.. రామ్ ఇప్పుటి వరకు చేసిన సినిమాలుకు భిన్నంగా పక్కా మాస్ యాక్షన్ హీరోగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. చూద్దాం రామ్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడు…?

Share post:

Latest