ఆ ఒక్క మాట తో ఏడ్చేసిన అల్లు అర్జున్‏..వీడియో వైరల్..!!

అల్లు శిరీష్-అను ఇమ్మానుయేల్ కలిసి జంటగా నటించిన సినిమా “ఊర్వశివో రాక్షసివో” . నవంబర్ 4న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్సడ్ టాక్ సంపాదించుకుంది. అయితే అల్లు శిరీష్ కెరియర్ లోనే ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నమోదు అయింది. ఇప్పటివరకు అల్లు శిరీష్ చాలా సినిమాల్లో నటించాడు . కానీ ఏ సినిమాలో కూడా ఇలాంటి విజయం అందుకోలేదు.

శ్రీరస్తు శుభమస్తు సినిమా హిట్ అయిన ఆ క్రెడిట్ మొత్తం లావణ్య త్రిపాఠి తన ఖాతాలో వేసుకుంది . అయితే అల్లు శిరీష్ రీసెంట్గా నటించిన సినిమా ఊర్వశివో రాక్షశివో ఈ సినిమా మాత్రం మంచి పాజిటివ్ కామెంట్స్ తో దూసుకుపోతుంది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు శిరీష్ నటనపరంగా జనాలను మెప్పించాడు అంటున్నారు ఫాన్స్ . కాగా ఈ సినిమా హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ అందుకోవడంతో హిట్ టాక్ నమోదు చేసుకోవడంతో సినిమా బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది .

ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ స్పీచ్ అందరిని ఆకట్టుకునింది . అంతేకాదు అల్లు అర్జున్ కి అల్లు శిరీష్ అంటే చాలా ఇష్టం. పేరుకు తమ్ముడే అయినా సరే కొడుకుల చూస్తూ ఉంటాడు . ఫస్ట్ టైం అల్లు శిరీష్ తన మాటలతో అల్లు అర్జున్ ని మెల్ట్ చేసేసాడు . ఎమోషనల్ గా ఫీల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నారు . ప్రస్తుతం ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

అల్లు శిరీష్ మాట్లాడుతూ ..”అరవింద్ గారి అబ్బాయిగా పుట్టడం నా అదృష్టం ..బన్నీ అన్న నన్ను తమ్ముడిలా కాకుండా కొడుకులా చూస్తాడు ..బన్నీకు అయాన్ ఎలాగో నేను అలాగే . ఈ విషయం నాకు బాగా తెలుసు . నేను సినిమా పరంగా సక్సెస్ అవ్వాలని బన్ని చాలా ట్రై చేశాడు . చాలా రోజుల తర్వాత సినిమా హిట్ అవ్వడంతో చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా హిట్ అవ్వడం తో నేను ఎంత సంతోష పడుతున్నానో కానీ బన్నీ అయితే సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకు కూడా థాంక్స్ అన్న . వచ్చే ఏడాది పుష్ప2తో బాక్సాఫీస్ బద్దలై పోతది . మరోసారి తెలుగు స్థాయి ఏంటో దేశానికి చూపిస్తాడు మా అన్న బన్నీ “అంటూ శిరీష్ గర్వంగా చెప్పుకున్న స్పీచ్ ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా తమ్ముడు అలా తన గురించి చెబుతూ ఉంటే బన్నీ ఎమోషనల్ గా ఫీల్ అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Share post:

Latest