మళ్ళీ ఎమ్మెల్యేలకు క్లాస్..జగన్ టెన్షన్ అదే..!

నెక్స్ట్ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని టార్గెట్‌గా పెట్టుకున్న జగన్..ఆ దిశగానే ముందుకెళుతున్నారు. ఓ వైపు పథకాల పేరిట ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తూ..మరో వైపు పార్టీని సైతం బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నారు. గత కొంతకాలం నుంచి పార్టీపై జగన్ ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే వరుస పెట్టి ఎమ్మెల్యేలతో వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. ఈ వర్క్‌షాపుల్లో ఎమ్మెల్యేలకు గట్టిగా క్లాస్ ఇస్తున్నారు. పనిచేయని ఎమ్మెల్యేలకు సీటు కూడా ఇవ్వనని వార్నింగ్ ఇస్తున్నారు.

ఇకనుంచైనా సరిగ్గా పనిచేయాలని చెప్పి క్లాస్ పీకుతున్నారు..సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు గడపగడపకు ఎక్కువ వెళ్ళడం లేదని, వారికి నెక్స్ట్ సీటు ఇవ్వనని చెప్పారు. గత వర్క్ షాపుల్లో ఇదంతా జరిగింది. నెక్స్ట్ పనితీరు మెరుగుపర్చుకోవాలని చెప్పారు. ఇదే క్రమంలో డిసెంబర్ 4న మరో వర్క్ షాప్ నిర్వహించడానికి జగన్ సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై చేయించిన సర్వే రిపోర్టుల ఆధారంగా, ఎవరైతే సరిగ్గా ప్రజల్లో ఉండటం లేదో..వారికి ఈ సారి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయారు.

అయితే కొందరు ఎమ్మెల్యేల పనితీరు విషయంలో జగన్ డౌట్ గానే ఉన్నట్లు తెలుస్తోంది..అందుకే పదే పదే వర్క్ షాపులు పెడుతున్నారు. పైగా టీడీపీ-జనసేన పొత్తు అనేది వైసీపీకి పెద్ద టెన్షన్‌గా మారింది. పైకి 175 సీట్లు టార్గెట్ అంటున్నారు గాని..అంతర్గతంగా గెలిచి అధికారంలోకి వస్తే చాలు అనే విధంగా వైసీపీలో పరిస్తితి కనిపిస్తోంది.

175కి 175 అని టార్గెట్ పెట్టుకుంటే కనీసం 100 సీట్లు అయిన వస్తాయని భావిస్తున్నట్లు ఉన్నారు. అంత కాన్ఫిడెన్స్ ఉంటే..ఈ వర్క్ షాపులు, ఎమ్మెల్యేలకు క్లాస్ ఇవ్వడం అనేది అవసరం ఉండదు. మొత్తానికి నెక్స్ట్ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటే విధంగా సీట్లు తెచ్చుకుంటే చాలు. అందుకే పదే పదే ఎమ్మెల్యేలకు జగన్ గట్టిగా క్లాస్ ఇస్తున్నారు.