పూరి ఎఫెక్ట్.. మళ్ళీ అలాంటి పనికి రెడీ అయిన ఛార్మీ..!?

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా లోకం. రంగుల ప్రపంచం ఎప్పుడు ఎలా సిచువేషన్స్ మారిపోతాయో ఎవరు చెప్పలేరు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అయినా సరే సినిమా ఇండస్ట్రీలో ఏ మూమెంట్లో ఏం జరుగుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు . గెస్ చేయలేరు. గెస్ చేసింది కచ్చితంగా జరగదు . ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరిగాయి . ఈ సినిమా ఇండస్ట్రీ చేసిన మాయలకు ఎంతోమంది స్టార్స్ బలైపోయారు . ఆ లిస్ట్ లోకే వస్తుంది ఛార్మి. “నీతోడు నాకు కావాలి” అంటూ ఇండస్ట్రీకి పరిచయమైన ఛార్మి..ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఏలేసింది.

 

పేరుకు పంజాబీ కుటుంబంలో జన్మించిన ఛార్మి 14 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టింది. అంతేకాదు చూడటానికి అచ్చం తెలుగింటి అమ్మాయిలా ఉండడంతో ఛార్మిని జనాలు బాగా ఆదరించారు . ఈ క్రమంలోనే వరుసగా ఛార్మీకి అవకాశాలు వచ్చాయి. కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హీరోయిన్ అనే ట్యాగ్ ను వేయించుకున్నింది ఛార్మీ . అంతే కాదు శ్రీ ఆంజనేయం సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఛార్మి ..ప్రభాస్, బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్ , వెంకటేష్ లాంటి స్టార్ హీరో అందరితో నటించి మెప్పించింది .

అంతేకాదు కన్నడ భాషలో కూడా నటించి మొత్తం గా 40 కి పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఛార్మి,, ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో చెప్పనవసరం లేదు . ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీ ని ఏ లేసిన ఛార్మి ..ప్రజెంట్ నిర్మాతగా పలు సినిమాలను నిర్మిస్తూ జీవనం కొనసాగిస్తుంది . కాగా రీసెంట్గా ఆమె భారీ అంచనాలు పెట్టుకొని ప్రొడ్యూస్ చేసిన సినిమా లైగర్ అట్టర్ ఫ్లాప్ అయింది . దీంతో ఛార్మి ప్రొడ్యూసర్ గా కూడా ఫ్లాప్ అయింది అంటూ ట్రోల్ చేశారు .

అంతే కాదు ఛార్మి ఇన్నాళ్లు సినిమాలు చేసి దాచుకున్న డబ్బులు మొత్తం లైగర్ సినిమాతో ఖాళీ అయ్యాయి అంటూ వార్తలు కూడా వినిపించాయి . కాగా ఈ టైం లోనే ఛార్మి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. ఈసారి ఎలాంటి పాత్రలకైనా సిద్ధం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తోందట. ఈ క్రమంలోనే తన పాత పరిచయాలను కొత్తగా రీస్టార్ట్ చేస్తుంది ఛార్మి అంటూ న్యూస్ వైరల్ గా మారింది . అసలు దీని అంతటికి కారణం పూరి జగన్నాథ్ అంటూ మండిపడుతున్నారు . అసలు ఆయన ఆమెకు దూరంగా ఉంటే చార్మి సినిమాలో ఏదో ఒక రోల్స్ చేసుకుంటూ బ్రతికేసేదని నిర్మాణరంగం వైపు లాగేసి ముంచేసాడని ఆయన పై మండిపడుతున్నారు ఛార్మీ మీ ఫ్యాన్స్. చూడాలి మరి ఈసారి ఛార్మి ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో..?