ల‌వ‌ర్స్ అయినా, క‌పుల్స్ అయినా ఆ ప‌ని చేస్తే చాలా ప్ర‌మాదం: రాధిక అప్టే

కొందరు పాటించకపోయినప్పటికీ కూడా ఉచిత సలహాలు మాత్రం బాగానే ఇస్తుంటారు. నటి రాధిక ఆప్టే లాంటి వాళ్ళని చూస్తుంటే అప్పుడప్పుడు అలానే అనిపిస్తుంది. ఈమె ఇటీవల కాస్టింగ్ కౌచ్ అంటూ సినీ ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. ఈమె తమిళంలో ధోని, కబాలి వంటి పలు సినిమాల్లో హీరోయిన్గా నటించి తెలుగులో కూడా ప‌లు సినిమాల్లో నటించింది.

ప్రస్తుతం రాధిక బాలీవుడ్ చిత్రాలపై దృష్టి సారిస్తూ ఎక్కువగా వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ బాలీవుడ్ బ్యూటీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రేమికుల గానీ, కపుల్స్ గాని తమ మధ్య గొడవలు వస్తే ఇతరులు మాటలు అసలు వినకండి అంటూ చెప్పుకొచ్చింది. ఎందుకంటే వాళ్లు తమ మధ్యకు వస్తే తమ గొడవలు మరింత పెరుగుతాయే గాని తగ్గవని పేర్కొంది.

అంతేకాకుండా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి అగాథం పెరిగే ప్రమాదం ఉంది..పైగా మన సమస్యలను ఎలా సరిదిద్దుకోవాలన్నది మనకు మాత్రమే తెలుసు అంటూ బాలీవుడ్ బ్యూటీ ఉచిత సలహాలు ఇచ్చింది. ప్రస్తుతం రాధిక ఆప్టే చేసినా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share post:

Latest