15 సంవత్సరాలైంది.. ఫస్ట్ టైం ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పేసిన దీపిక పదుకొనే.. ఇంట్రెస్టింగ్ పోస్ట్..!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే బాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి 15 సంవత్సరాలు పూర్తయింది. 2007లో షారుక్ ఖాన్ హీరోగా ఓం శాంతి ఓం సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన దీపిక.. ఆ సినిమా దగ్గర నుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూసుకోకుండా స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆ సినిమా ఆ రోజుల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. దీపికా పదుకొనే సినిమా పరిశ్రమకు పరిచయమై 15 సంవత్సరాలైనా సందర్భంగా షారుక్ ఖాన్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

15 years of Deepika Padukone: 15 memorable performances of the actress

షారుక్ ఖాన్ దీపిక పదుకొనే క‌లిసి ఇప్ప‌టి వరకు మూడు సినిమాల్లో నటించారు. వీరిద్దరూ నటించిన మూడు సినిమాలు సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. ఇక ఇప్పుడు తాజాగా వీరిద్దరూ కలిసి 4 సినిమా పఠాన్ లో నటిస్తున్నారు. ఇక ఇప్పుడు షారుక్ ఖాన్ ఈ నాలుగు సినిమాలలో దీపిక కి తనకు సంబంధించిన పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Shahrukh Khan : 15 ఏళ్లయింది.. నిన్నే చూస్తూనే ఉన్నాను.. దీపికా పదుకొనేకి స్పెషల్ ట్వీట్ చేసిన షారుఖ్..

వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసిన షారుక్ ఖాన్ వాటి కింద.. ” ఈ 15 సంవత్సరాలు..నీ పట్టుదలతో.. ఎంతో అద్భుతమైన నటనతో ఇక్కడ దాకా వచ్చావు. నేను నిన్ను చూస్తూనే ఉన్నాను, నీ కళ్ళల్లోకి చూస్తున్నాను, నీ వైపే చూస్తున్నాను”.. అంటూ ఆ పోస్ట్ కింద కామెంట్ చేశాడు. దీంతో ఇప్పుడు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీళ్ళిద్దరూ కలిసి నటించిన మూడు సినిమాలు ఘనవిజయం అందుకున్నాయి. వీరిద్దరూ కలిసి నటిస్తున్న పఠాన్ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా మరో సూపర్ హిట్ సినిమాగా అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

Share post:

Latest