వావ్: శంకర్-రామ్ చరణ్ సినిమాలో ఎవరు ఊహించని ట్విస్ట్.. మెగా ప్లాన్ అద్దిరిపోయిందిగా.!!

రామ్ చరణ్ హీరోగా క్రేజీ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాను పిరియాడిక్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఆయన ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చు అని నమ్మి సాయుధ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.. ఇక అప్పుడు ఆయన వెనకాల వచ్చిన ఒక వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాలో వచ్చే ప్లాష్ బ్యాక్ ఉండబోతుందట. ఈ క్రమంలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రను కూడా శంకర్ డిజైన్ చేశారట.

ఈ సినిమాలో వచ్చే సెకండాఫ్ లో స్పెషల్ ఎపిసోడ్ లో సుభాష్ చంద్రబోస్ కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ఆ ఎపిసోడ్ సినిమా మొత్తం మీద ఎంతో అద్భుతంగా ఉంటుందని… సినిమాకి కీలకంగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఆ పాత్రను శంకర్ ఎంతో అద్భుతంగా బ్రిటిష్ కాలం నాటి డైలాగులను దగ్గరుండి చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నాడట. ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే రామ్ చరణ్ క్యారెక్టర్ సినిమాకే హైలెట్గా నిలుస్తాడట. సినిమాలో చరణ్ లుక్‌ కోసం బాలీవుడ్ ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పనిచేస్తున్నాడట. ఇక మొత్తానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బరువైన ఎమోషన్స్ తో పాటు గ్రాండ్ విజువల్స్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

Share post:

Latest