సమంతతో ప్రేమలో పడిపోయానంటున్న విజయ్ దేవరకొండ… షాక్ లో అక్కినేని ఫ్యాన్స్!

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమా ‘ఏమాయ చేసావే’ సినిమాతో యావత్ తెలుగు కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొట్టిన మాయలేడి సమంత. అంతటితో ఆగకుండా ఆ సినిమాలో లీడ్ రోల్ చేసిన అక్కినేని వారసుడు అయినటువంటి నాగ చైతన్యను సైతం మాయచేసి ఏకంగా పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లపాటు ఉత్తమ దంపతులుగా పేరు తెచ్చుకున్న వీరు అనతికాలంలోనే మరి ఏమయ్యిందోగాని విడాకులు తీసుకున్నారు. కాగా వారి విడాకులు తీసుకొని కూడా సంవత్సరం కావస్తోంది.

అయితే విడాకుల తరువాత అమ్మడి పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ రెట్టింపు ఉత్సాహంతో సామ్ దూసుకుపోతోంది. ఫామిలీ మాన్ వెబ్ సిరీస్ తో ఏకంగా సామ్ పాన్ ఇండియా యాక్ట్రెస్ అయిపోయిది. ఇక ఆ తరువాత వచ్చిన పుష్ప సినిమా సమంతకి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్ సైతం పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయింది. ఇకపోతే తాజాగా సమంత, విజయ్ దేవరకొండ జంటగా ‘ఖుషి’ అనే సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

అలాగే ఆమె ఆల్రెడీ తమిళంలో చేసిన సినిమా ‘యశోధ’ సినిమా ట్రైలర్ ని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన సంగతి విదితమే. ఈ సందర్భంగా విజయ్ ఆడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత అంటే తనకి క్రష్ ఉందని, కాలేజ్ చదువుతున్నప్పుడే సమంతని సినిమాల్లో చూసి పడిపోయానని చెప్పుకొచ్చాడు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇలాంటి కామెంట్లు ఓ వర్గం వారిని బాగా ఇబ్బందిపెడుతున్నాయట. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తమ బాధను వెళ్లగక్కుతున్నారు.

Share post:

Latest