Bigg Boss 6: ఊహించని కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్..జనాలు పిచ్చ హ్యాపీ..!?

తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షోగా పాపులారిటీ సంపాదించుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం ఆరో సీజన్ కొనసాగుతుంది. ఈ మధ్యనే గ్రాండ్ గా సీజన్ 6 ప్రారంభించిన బిగ్ బాస్ ..షో మొత్తం రసవత్తరంగా సాగుతుంది. అవసరం ఉన్నా లేకపోయినా ఏడ్చే ఆడవాళ్లు ..ఆడవాళ్లు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లిపోయి ఓవర్ చేసే కంత్రి మగాళ్లు ..కంటెంట్ కోసం ఎలాంటి పని అయినా చేయడానికి సిద్ధపడ్డ జగత్ కిలాడీలు ..హౌస్ లో చాలామంది ఉన్నారు అంటూ బయట ఉన్న నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే హౌస్ లో ఒక్కొక్కరు ఆస్కార్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు.

అయితే ఎంత ఆస్కార్ పర్ఫార్మెన్స్ లు చూపించిన టిఆర్పి రేటింగ్ మాత్రం పెరగడం లేదు . నాగార్జున వచ్చి అరుపులు కేకలతో రచ్చ చేసిన.. హౌస్ లోని కంటెస్టెంట్స్ ..కంటెంట్ ఇవ్వడం లేదు. వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు తప్పిస్తే.. హౌస్ లోకి గేమ్ ఆడడానికి వచ్చామా ..ట్రోఫీ కొట్టడానికి వచ్చామా అన్న పాయింట్స్ మరిచిపోయి ..ఏ అమ్మాయి చిక్కితే ఆ అమ్మాయి చేతిని పట్టేసుకుంటున్నారు. అవసరమైన వాళ్ళు అన్నం కల్పించుకొని గోరు ముద్దలు కూడా తినిపించుకుంటున్నారు అంటూ జనాలు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. కాగా ఈ వారం హౌస్ నుండి షాకింగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నట్టు సోషల్ మీడియాలో వార్త వినిపిస్తుంది. నాలుగో వారంలో పదిమంది నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే.

ప్రతి వారం లాగే ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి ఒకరు సిద్ధంగా ఉండాలి . కాగా నామినేషన్స్ లో ఉన్న వారిలో రేవంత్, గీతు, శ్రీహన్లకు ఎక్కువ ఓట్లు పడిన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు శ్రీ సత్య తో పులిహోర కలిపిన బ్యాచ్ గా అర్జున్ మంచి మార్కులు వేయించుకున్నాడు, ఒకవేళ అర్జున్ కి ఓట్లు తక్కువ వచ్చినా కానీ బిగ్ బాస్ ఇంట్లో నుంచి పంపించాడు. అది కాయం పులిహోర రాజా కదా ..అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు రాజ్, కీర్తి ,సుదీప, సూర్య, ఆరోహి ఇనయా లలో ఒక్కరు ఎలిమినేట్ అవుతారని అందరికీ తెలిసిన విషయమే. కాగా ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మిగతా అందరి కంటెస్టెంట్ల కల్లా సుదీప- ఆరోహి కి ఓట్లు లిస్ట్ గా గా వచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఎవరు ఊహించిన విధంగా ఆరోహిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తుంది .నిజానికి సుదీప కి, ఆరోహి కి ఒకే ఓట్లు వచ్చాయట . కానీ ఆరోహి కి హౌస్ లో ఉండే బ్యాడ్ నేమ్ కారణంగా షోలో ఉంటే టిఆర్పి ఎక్కడ దెబ్బతింటుందో అని ఆమెను ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో ఆరోహి హేటర్స్ పిచ్చ హ్యాపీగా ఉన్నారు . మనకు తెలిసిందే హౌస్ లో ఆరోహికి ఒక వ్యక్తికి పడని విషయం. ఆ వ్యక్తి ఎవరో మీకు బాగా తెలుసు కదా..! దీంతో ఆరోహి బయటకు రాకకు ముందే మీమ్‌స్ క్రియేట్ చేసుకుని సిద్ధంగా ఉన్నారు ట్రోలర్స్.