పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన త్రిష.. కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో త్రిష ఒకరిని చెప్పవచ్చు. ఈమె వయసు ప్రస్తుతం 39 సంవత్సరాలు. ఈమె వయసు పెరుగుతున్న కొద్దీ అందం మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఇక ఇంత వయసు వచ్చినా కూడా ఈ ముద్దుగుమ్మ వివాహానికి దూరంగా ఉండడంతో అభిమానులు కాస్త నిరుత్సాహ చెందుతున్నారు. గతంలో త్రిష పెళ్లికి సంబంధించి ఎన్నో వార్తలు చాలా వైరల్ గా మారాయి. ఆ వార్తలలో మాత్రం ఎలాంటి నిజం. తాజాగా త్రిష వివాహం, విడాకుల గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది వాటి గురించి చూద్దాం.

Trisha to Quit Acting after Ponniyin Selvan?
త్రిష మాట్లాడుతూ.. 40 ఏళ్లు వచ్చాయి ఇంకా ఎప్పుడు వివాహం చేసుకుంటావని అడుగుతూ ఉంటారని తెలియజేసింది. అయితే వివాహానికి వయసుతో సంబంధం లేదని తన అభిప్రాయని తెలియజేసింది. ప్రస్తుతం చాలామంది చిన్న చిన్న కారణాల వల్ల విడాకులు తీసుకుంటున్నారని అలా తీసుకోవడం తనకు అసలు నచ్చడం లేదని త్రిష తెలియజేయడం జరిగింది. పెళ్లి చేసుకునేది చాలా సంతోషంగా ఉండడం కోసమే.. పెళ్లి చేసుకుని సంతోషంగా లేకపోవడం కరెక్ట్ కాదని త్రిష తెలియజేసింది.

Trisha Krishnan Looks Gorgeous in Traditional Saree
తనకు ఎవరైనా సరైన వ్యక్తి దొరికితే మాత్రం కచ్చితంగా వివాహం చేసుకుంటారని తెలియజేసింది. వివాహ బంధాన్ని నేను జీవితాంతం కొనసాగే ఒక ప్రయాణం లాంటిది. అందుచేతనే ఆచితూచి అడుగులు వేయాలని తెలియజేస్తుంది త్రిష. త్రిష త్వరలోనే పెళ్ళి కి సంబంధించి శుభవార్త తెలియజేస్తుందేమో చూడాలి. ఇక ప్రస్తుతం త్రిష కెరియర్ విషయానికి వస్తే ఒక్కో సినిమాకి ఈమె రూ.2 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లుగా సమాచారం. త్రిష పోన్నియన్ సెల్వన్ మొదటి భాగంలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. త్రిష క్రేజ్ ప్రతిరోజు అమాంతం పెరుగుతూ ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం త్రిష కు సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

Share post:

Latest