సినిమా పరిశ్రమంలోకి వచ్చాక చాలామంది హీరోయిన్లు తమ పేరును మార్చుకుంటూ ఉంటారు. అప్పటి వరకు ఓ పేరు ఉంటే సినిమాల్లోకి వచ్చాక ఆ పేరు కాకుండా మరో పేరును పెట్టుకుంటారు. వారిలో కొంతమంది న్యూమరాలజీ ప్రకారం జాతకం ప్రకారం వారు తమ పేరును మార్చుకుంటారు. మరికొందరి పేర్లు దర్శకులు మారుస్తుంటారు. అలా మన సౌత్ ఇండియన్ హరోయిన్లు చాలామంది పేర్లు మార్చుకున్నారు. ఇక ఆ పేరు మార్చుకున్న హరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
జయసుధ:
సీనియర్ హీరోయిన్లలో ఒకరైన జయసుధ తన నటనతో అభినయంతో సహజ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జయసుధ అసలు పేరు ఏమిటంటే సుజాత. సినిమాలలోకి రావడానికి ఆమె తన పేరుని జయసుధ మార్చుకున్నారు.
జయప్రద:
సీనియర్ హీరోయిన్ జయప్రద కూడా తన అందం అభినయంతో సీనియర్ హీరోలతో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జయప్రద అస్సల పేరు ఏమిటంటే లలితా రాణి. ఈమె కూడా సినిమాలలోకి రావడానికి తన పేరును జయప్రదగా మార్చుకున్నారు.
శ్రీదేవి:
అతిలోక సుందరి శ్రీదేవి గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే. తమిళనాడులో జన్మించిన శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి వచ్చింది. తర్వాత సీనియర్ హీరోల అందరితో నటించి అతిలోకసుందరిని బిరుదును సంపాదించుకుంది. శ్రీదేవి అసలు పేరు ఏమిటంటే శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్. ఈమె కూడా సినిమాల్లోకి వచ్చే ముందు తన పేరును శ్రీదేవిగా మార్చుకుంది.
జీవిత రాజశేఖర్:
తలంబరాలు సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన నటి జీవిత. ఈమె అసలు పేరు పద్మ. సినిమాలలోకి వచ్చే ముందు తన పేరుని జీవితాగా మార్చుకుంది.
సౌందర్య:
తన నటనతో తన అభినయంతో తెలుగు వారికి గుర్తుండి పోయేనటి సౌందర్య. ఈమె తన సినీ కెరియర్లో 100 సినిమాలకు పైగా నటించింది. ఈమె అసలు పేరు ఏమిటంటే సౌమ్య . సినిమాలలోకి వచ్చే ముందు తన పేరుని సౌందర్యగా మార్చుకుంది.
ఆమని:
జంబలకిడిపంబ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఆమని. ఈమె ఆ తర్వాత తెలుగు స్టార్ హీరోలు అందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె అసలు పేరు ఏమిటంటే మంజుల. సినిమాలలోకి వచ్చే ముందు ఆమనిగ తన పేరును మార్చుకుంది.
రోజా:
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు రోజా సినిమాల లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. ఈమె అసలు పేరు ఏమిటంటే శ్రీలత రెడ్డి. సినిమాలలోకి వచ్చే ముందు రోజాగా తన పేరును మార్చుకుంది.
రంభ:
విజయవాడలో పుట్టిన రంభ దర్శకుడు వివి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఈమె అసలు పేరు ఏమిటంటే విజయలక్ష్మి. సినిమాలలోకి వచ్చే ముందు ఈమె తన పేరును రంభగా మార్చుకుంది.
రాశి:
అందాల భామ రాశి తెలుగు చత్ర పరిశ్రమంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ను మొదలుపెట్టి. తర్వాత హీరోయిన్గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె అసలు పేరు ఏమిటంటే విజయలక్ష్మి. సినిమాలలోకి వచ్చే ముందు తన పేరుని రాశిగా మార్చుకుంది.
భూమిక:
అందాల తార భూమిక టాలీవుడ్కు యువకుడు సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హిరోగా వచ్చిన ఖుషి సినిమాతో ఈమెకు టాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది. టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరితో నటించింది. ఈమె అసలు పేరు ఏమిటంటే రచన చావ్లా. సినిమాలలోకి వచ్చే ముందు తన పేరుని భూమికగా మార్చుకుంది.