అమ్మ మాట విని జీవితాని సర్వ నాశనం చేసుకున్న తెలుగు హీరో.. ఆ మాటే శాపం గా మారిందా..?

జనరల్ గా మన ఇంట్లోని పెద్దవారు ఓ మాట అంటూ ఉంటారు ఒక అబ్బాయి బాగుపడాలి అన్నా.. నాశనం అయిపోవాలి అన్నా దానికి కారణం ఒక ఆడదే అని ..బహుశా ఇతని విషయంలో ఇదే నిజం అనిపిస్తుంది. ఎస్ టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న తరుణ్ తన జీవితంలో ఇద్దరు ఆడవాళ్లను నమ్మి మోసపోయి చివరికి కెరీర్ నే సర్వనాశనం చేసుకున్నాడు అంటూ సినీ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అయ్యాయి . వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరియర్ను ప్రారంభించిన తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్నప్పుడు సీరియల్స్ లో.. ఆ తర్వాత సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ..ఆ తర్వాత పెద్దయ్యాక సినిమా ఇండస్ట్రీలో హీరోగా తన లక్ ని పరీక్షించుకున్న తరుణ్ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. మరీ ముఖ్యంగా తరుణ్ జాతకం తిరిగిపోయిన సినిమా ఏది అంటే టక్కున అందరు చెప్పే పేరు “నువ్వే కావాలి”. ఈ సినిమా తరుణ్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా పెట్టిన దానికన్నా 10 రెట్లు లాభాలు తీసుకొచ్చి మేకర్స్ కి హ్యూజ్ ప్రాఫిట్ సంపాదించి పెట్టింది.

ఇక తర్వాత తరుణ్ “ప్రియమైన నీకు , నువ్వు లేక నేను లేను , చిరుజల్లు, నువ్వే నువ్వే అంటూ వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్లని తన ఖాతాలో వేసుకున్నాడు”. ఇక తర్వాత అదృష్టం సినిమాతో మళ్ళీ బ్యాక్ స్టెప్ చేసిన నిన్నే ఇష్టపడ్డాను సినిమాతో కంబాకు ఇచ్చాడు. ఇక ఆ తర్వాత నటించినా “సఖియా ,సోగ్గాడు ,నవవసంతం ,భలే దొంగలు ,శశిరేఖ పరిణయం ,చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి ,ఇది నా లవ్ స్టోరీ” అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. అయితే ఇక తర్వాత సినిమా ఇండస్ట్రీలో హీరోగా సినిమా చేయలేదు.

అయితే తరుణ్ కెరియర్ ఇలా నాశనం అయిపోవడానికి కారణం వాళ్ళ అమ్మగారు అంటూ కొందరు చెప్పుకొస్తున్నారు. మనకు తెలిసిందే తరుణ్ వాళ్ళ అమ్మ రోజా రమణి తెలుగు సినిమా నటి. భక్త ప్రహ్లాద సినిమాలో బేబీ రోజా రమణిగా చాలా మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత 1970 1980 దశకాలలో తెలుగు, తమిళ, మలయాళ, కనడ సినిమాలలో స్టార్ కథానాయకగా ఓ వెలుగు వెలిగింది. తరుణ్ సినిమాలు చేస్తున్న టైంలో ఆర్తి అగర్వాల్ తో ప్రేమలో పడటం.. అది రోజా రమణికి నచ్చక ఆర్తి అగర్వాల్ కి వార్నింగ్ ఇచ్చి దూరం పెట్టించడం.. ఈ కారణంగా తరుణ్ అటు ప్రేమపై ఇటు సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేయలేక అమ్మ మాట కాదనలేక ఆర్తి అగర్వాల్ ను వదులుకోవడం. సినిమా ఇండస్ట్రీలో అతని పరువు తీసేసింది. అంతేకాదు ప్రేమించిన అమ్మాయిని మోసం చేసిన కారణంగా తరుణ్ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అంటూ గతంలో వార్తలు వినిపించాయి .ఇలా అమ్మ చెప్పిన మాట విని ఆర్తి అగర్వాల్ ఉసురుపోసుకుని తరుణ్ కెరియర్ నాశనమైంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.

Share post:

Latest