రాజమౌళితో సినిమా చేయకపోవడానికి కారణం అదే.. చిరంజీవీ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేయడానికి ఎంతమంది హీరోలు సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మొదటిసారి చిరంజీవి ఆయన దర్శకత్వంలో నటించాలని కోరిక తనకు లేదని విషయాన్ని తెలియజేశారు. గాడ్ ఫాదర్ సినిమా ప్రచారంలో భాగంగా బాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

SS Rajamouli reveals why Chiru's Sye Raa is bigger than Baahubali - IBTimes  India
ఇంటర్వ్యూలో యాంకర్ రాజమౌళి తో ఇటీవల సినిమాలో నటించనని అన్నారు కదా ఎందుకు అనే ప్రశ్న చిరంజీవిని అడగగా.. అందుకు చిరంజీవి మాట్లాడుతూ రాజమౌళి చాలా గొప్ప దర్శకుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఎంతో పేరు తెచ్చిన డైరెక్టర్ అని తెలిపారు. ప్రతి విషయాన్ని కూడా ఆయన ఎంతో లోతుగా చూస్తారు. ఆయన కోరుకొనే అవుట్ ఫుట్ ఒక నటుడుగా నేను ఇవ్వగలనో లేదో నాకు తెలియదు.. సినిమా తెరకెక్కించడానికి తను ఎంత సమయం పడుతుందో కూడా తెలియదు. ఒక్కో సినిమాతో మూడు నుంచి ఐదు సంవత్సరాలు ప్రయాణిస్తూ ఉండాల్సి ఉంటుంది.

When Rajamouli Rejected Chiru's Offer | cinejosh.com
ఇక అందుచేతనే ఆయనతో పనిచేయాలని పాన్ ఇండియా నటుడుగా గుర్తింపు పొందాలని లేదు.. ఇక అంత సమయంలోపు నాలుగైదు సినిమాలు చేయవచ్చు కదా అని చిరంజీవి నవ్వుతూ తెలియజేశారు. తన ప్రతిభకు తన తనయుడు రామ్ చరణ్ కొనసాగిస్తారని తెలియజేశారు. ఓ సినిమాకు దర్శకత్వం వహించాలని ఉందని కూడా తన మనసులో మాటగా తెలియజేశారు. ఇక చిరంజీవి హీరోగా ప్రస్తుతం మోహన్ రాజు దర్శకత్వంలో తెరకెక్కించిన గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమాతో నైనా అభిమానులను మెప్పిస్తారేమో చూడాలి చిరంజీవి.

Share post:

Latest