కుటుంబ విషయంపై పృద్విరాజ్ కు షాకింగ్ తీర్పు ఇచ్చిన కోర్టు..!!

ప్రముఖ సినీ నటుడు కమెడియన్ పృథ్వీరాజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ మధ్యకాలంలో ఎక్కువగా పలు వివాదాలలో బాగా పాపులర్ అయ్యారని చెప్పవచ్చు. ఒక వైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో రాణించాలని ఎంత ప్రయత్నించినా కూడా సక్సెస్ కాలేకపోయారు. దీంతో సినిమా అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఈ నటుడికి దీంతో కొద్దిరోజుల క్రితం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కూడా తెలియజేశారు. ఇప్పుడు తాజాగా నటుడు పృథ్వీరాజ్ విషయంపై ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది వాటి గురించి తెలుసుకుందాం.

Telugu Actor Prudhvi Raj Met With An Accident - Filmibeat

తాజాగా పృథ్వీరాజ్ కు విజయవాడ 14వ అదనపు జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది. తన భార్య శ్రీలక్ష్మికి ప్రతినెల రూ.8 లక్షల రూపాయలు భరణం చెల్లించాలని కోర్టు ఉత్తర్వులను ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. విజయవాడకు చెందిన శ్రీ లక్ష్మీ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడానికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్ తో 1984లో వివాహం అయ్యింది. ఇక వీరికి ఒక కుమార్తె, కొడుకు కూడా ఉన్నారు. నటుడు పృథ్వీరాజ్ నటన మీద మక్కువతో తన అత్తగారింట్లో ఉంటూనే చెన్నైకి వెళ్లి పలు సినిమాలలో నటించేందుకు ప్రయత్నించే వారట.

Prudhvi Raj Height, Age, Wife, Family, Biography & More » StarsUnfolded

తన భర్త ఖర్చులను సైతం తమ తల్లిదండ్రులే భరించాలని తరచూ తనని వేధిస్తున్నాడు అంటూ తన భార్య శ్రీలక్ష్మి కోర్టును ఆశ్రయించడం జరిగింది. అంతేకాక 2016 ఏప్రిల్ 5న ఇంట్లో నుంచి తనని బయటికి పంపించడంతో తన పుట్టింటికి చేరుకున్నట్లుగా బాధితురాలు తన ఫిర్యాదులో తెలియజేసినట్లు సమాచారం. ఇక తన భర్త సినిమాల ద్వారా టీవీల ద్వారా దాదాపుగా నెలకి రూ.30 లక్షల రూపాయల సంపాదిస్తారని అతని నుంచి భరణం ఇప్పించాలని 2017 జనవరి 10న న్యాయస్థానంలో ఈమె కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు పృథ్వీరాజ్ తన భార్యకు ప్రతినెల రూ.8 లక్షల రూపాయలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒకసారిగా పృధ్వీరాజ్ ఆయన అభిమానులు కూడా షాక్ అయ్యారు.