65 సీట్లలో నో డౌట్..వైసీపీకి రిస్క్?

టీడీపీ-జనసేన పొత్తు గురించి ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల చంద్రబాబు-పవన్ కలవక ముందు నుంచే రెండు పార్టీల పొత్తుపై రకరకాల చర్చలు జరిగాయి. పొత్తు ఉంటేన్తే వైసీపీకి చెక్ పెట్టడం సాధ్యమని లేదంటే మళ్ళీ వైసీపీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా బాబు-పవన్ కలవడంతో..పొత్తు దాదాపు ఫిక్స్ అని తెలుస్తోంది. ఈ పొత్తు వల్ల వైసీపీకి చాలా రిస్క్ అని ప్రచారం ఎక్కువ వస్తుంది.

అందుకే పొత్తు లేకుండా చేయడానికి వైసీపీ..పదే పదే పవన్‌ని అన్నీ సీట్లలో పోటీ చేయాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. అయినా సరే వైసీపీ ప్లాన్ పెద్దగా వర్కౌట్ అయ్యేలా లేదు. దాదాపు పొత్తు ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది. కాకపోతే ఎన్నికల ముందు అధికారికంగా పొత్తు గురించి రివిల్ చేస్తారు. అయితే పొత్తు నేపథ్యంలో వైసీపీకి డ్యామేజ్ ఎక్కువగానే ఉంటుందని ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల దాదాపు 50 సీట్లలో ఓట్లు చీలిపోయి వైసీపీ గెలిచిందని చెప్పొచ్చు. పొత్తు ఉంటే మాత్రం ఆ సీట్లలో వైసీపీకి రిస్క్ తప్పదు.

ఇక పొత్తు ఉంటే ఫలితం ఎలా ఉంటుందనే దానిపై టీడీపీ-జనసేన శ్రేణులు కొన్ని లెక్కలు వేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ 23, జనసేన ఒక సీటు గెలుచుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆ సీట్లని మళ్ళీ గెలుచుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. నాలుగు సీట్లు వదిలేసిన 20 ఖచ్చితంగా గెలుస్తారని చెబుతున్నారు.

అలాగే పొత్తు ప్రభావం వల్ల 50 సీట్లు లాస్ అయ్యారు. అందులో కనీసం 25 సీట్లు డౌట్ లేకుండా గెలుస్తారని, అలాగే కొందరు వైసీపీ ఎమ్మెల్యలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని, అందులో కనీసం 20 సీట్లు టీడీపీ-జనసేన గెలుస్తాయని అంటే..టోటల్‌గా 65 సీట్లు డౌట్ లేకుండా టీడీపీ-జనసేన కాంబినేషన్‌తో గెలుస్తారని, ఇంకో 25 సీట్లలో కష్టపడితే..మ్యాజిక్ ఫిగర్ 88 దాటడం సులువు అని అంటున్నారు. ఏదేమైనా గాని టీడీపీ-జనసేన పొత్తుతో వైసీపీకి పెద్ద రిస్క్ అని చెబుతున్నారు.