తాడిపత్రిలో కన్ఫ్యూజన్..లైన్‌లో అస్మిత్?

గత ఎన్నికల్లో ఊహించని విధంగా టీడీపీ ఓటమి పాలైన సీట్లలో తాడిపత్రి కూడా ఒకటి. ఇక్కడ జేసీ ఫ్యామిలీ ఓటమిని ఎవరూ ఊహించలేదు. ఖచ్చితంగా ఈ సీటు టీడీపీ గెలుస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా టీడీపీ నుంచి పోటీ చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి ఓడిపోయారు. ఏ విధంగా ఊహించని ఓటమి ఎదురైందో..అలాగే ఊహించని విధంగా తక్కువ సమయంలోనే పుంజుకున్న సీటు కూడా ఇదే.

ఓడిపోయిన దగ్గర నుంచి జేసీ ఫ్యామిలీ తాడిపత్రిపై ఫుల్ గా ఫోకస్ పెట్టింది. పైగా జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి..ఓ కేసు విషయంలో జైలుకు వెళ్లారు. జైలుకు వెళ్ళడంతో వారిపై సింపతీ పెరిగింది. అలాగే తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో రాజకీయం చేస్తూ మళ్ళీ బలం పెంచుకున్నారు. అసలు మున్సిపల్ ఎన్నికల్లో అన్నిచోట్ల టీడీపీ ఓడిపోతే తాడిపత్రిలో మాత్రం గెలిచింది. దీనికి కారణం జేసీ ఫ్యామిలీ ఎఫెక్ట్.

అలాగే ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఛైర్మన్ కూడా అయ్యారు. అక్కడ నుంచి ఇంకా దూకుడుగా ప్రభాకర్ రెడ్డి పనిచేసుకుంటూ వస్తున్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి పాజిటివ్ తగ్గుతూ వచ్చింది. ఎమ్మెల్యేగా తాడిపత్రికి ఆయన చేసింది పెద్దగా ఏం కనిపించలేదు. దీంతో అక్కడి ప్రజలు మళ్ళీ జేసీ వైపుకు వస్తున్నారు. ఇక ఈ సీటులో టీడీపీ గెలుపు ఖాయమనే విధంగా కాన్ఫిడెన్స్ వచ్చింది.

కాకపోతే ఈ సీటులో ఎవరు పోటీ చేస్తారనేది మాత్రం క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఈ సారి సీటుని అస్మిత్ రెడ్డికి కాకుండా ప్రభాకర్ రెడ్డికే ఇస్తారని ప్రచారం జరిగింది. ప్రభాకర్‌కు ఇస్తేనే డౌట్ లేకుండా గెలుస్తామని, బాబు కూడా అదే ఫిక్స్ అయ్యారని కథనాలు వచ్చాయి. అయితే అధికారికంగా ఇంచార్జ్‌గా అస్మిత్ రెడ్డి ఉన్నారు. తాజాగా నియోజకవర్గ సమీక్షా సమావేశాల్లో కూడా బాబు..అస్మిత్ రెడ్డితోనే భేటీ అయ్యి, తాడిపత్రిలో పరిస్తితులు తెలుసుకున్నారు..అలాగే కొన్ని సర్వే వివరాలని చెప్పి, భారీ మెజారిటీతో గెలవడానికి కృషి చేయాలని బాబు, అస్మిత్‌కు సూచించారు. ఈ భేటీ బట్టి చూస్తే..తాడిపత్రి సీటు అస్మిత్‌కే ఖాయమని అర్ధమవుతుంది.