ఓరి నీ దుంప తెగ..గడ్డం కోసం అంత పని చేసావు ఏందిరా సామీ..!!

సీనియర్ దర్శకుడు మణిరత్నం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణమైన సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న దర్శకులలో మణిరత్నం కూడా ఒకరు. ఈయన నిజంగా జరిగిన సంఘటల‌నను సినిమాలు తీసి హిట్ కొట్టడంలో సిద్ధహస్తుడు. మణిరత్నం తాజాగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా పొన్నియన్ సెల్వన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్లాప్ టాక్‌తో కూడా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా గురించి పక్కనపడితే మణిరత్నం ఎన్నో క్లాసికల్ సినిమాలను తీశాడు.. అవి ఎంతో సూపర్ హిట్ అయ్యాయి.

అలాంటి సినిమాలలో ముంబాయి సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో అరవింద్ స్వామి హీరోగా మ‌నీషా కోయిరాలా హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను మణిరత్నం ముంబైలో బాబ్రీ మసీద్ అల్లర్ల నేపథ్యంలో జరిగిన సంఘటనలను ఆధారం చేసుకుని సినిమా తీశాడు. ఈ సినిమాతో మణిరత్నం తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమాలోని పాటలు కూడా ఆ టైంలో ఆల్ టైం సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతున్న ఈ సినిమాని ప్రేక్షకులు ఇప్పటికీ ఎంతో స్పెష‌ల్‌గా చూస్తారు.

ఈ సినిమాలో ముందుగా హీరోగా తమిళ్ స్టార్ హీరో విక్రమ్‌ని నటింపజేయాలని అనుకున్నారట. మణిరత్నం విక్రమ్ కు స్టోరీ కూడా చెప్పి ఓకే చేపించాడట. విక్రమ్ ఆ టైంలో గడ్డం పెంచుకొని ఉన్నాడు. మణిరత్నం విక్రమ్ ని ఈ సినిమా కోసం మీరు గెడ్డం, మీసం తీసేయాలనికోరాడట. ఇక దీంతో విక్రమ్ కి కోపం వచ్చి ఈ సినిమా చేయనని చెప్పేశాడట. విక్రమ్‌ గడ్డం మీసం కోసం సూపర్ హిట్ సినిమాను వదులుకున్నాడు. తర్వాత మణిరత్నం ఆ సినిమాలో హీరోగా అరవింద్ స్వామిని ఒప్పించి తీశాడు.