వేలానికి శ్రీదేవి కట్టిన చీరలు.. వ‌చ్చిన డ‌బ్బును ఏం చేస్తారో తెలుసా?

అతిలోక సుందరి, దివంగనటి శ్రీదేవి గురించి ప్రత్యేక పరిచయాలు చేయనక్కర్లేదు. ప్రస్తుతం శ్రీదేవి భౌతికంగా మన మధ్య లేకపోయినా నిత్యం ఆమె సినిమాలతో అలరిస్తూ ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటుంది. అయితే 1980లో హీరోయిన్గా రాణించిన ఆమె పెళ్లి అనంతరం 1997లో సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

ఇక ఆ తర్వాత 2012లో శ్రీదేవి రీ ఎంట్రీ సినిమా `ఇంగ్లిష్ వింగ్లిష్` తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమా రిలీజ్ అయ్యి అక్టోబర్ 10న పదేళ్లు పూర్తి చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు డైరెక్టర్ గౌరీ షిండే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా 10వ‌ వార్షికోత్సవం నిర్వహించడంతోపాటు `ఇంగ్లిష్ వింగ్లిష్` సినిమాలో శ్రీదేవి కట్టిన చీరలు వేలం వేయాలని అనుకున్నట్లు గౌరీ షిండే అధికారికంగా ప్రకటించారు.

ఇక ఆ వచ్చిన డబ్బుతో బాలికల విద్య కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థకు ఇవ్వనున్నారట. అయితే ఈ విషయాలను గౌరీషింటే ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పారు. `ఇంగ్లిష్ వింగ్లిష్` సినిమాలో శ్రీదేవి సగటు ఇల్లాలిగా, పరభాష రాని గృహిణిగా ఆ తరువాత అమెరికా వెళ్లి ఆమె ఇంగ్లీషులో ఎంతటి ప్రావీణ్యం పొందారు అనే పాత్రలో నటించి.. ఆమె న‌ట‌తో అభిమానులందరినీ ఆకట్టుకునేలా చేశారు.