చుట్టాలబ్బాయిని మ్యారేజ్ చేసుకోమని బలవంతం చేస్తున్న సమంత తల్లి..?

గత కొన్ని నెలలుగా అగ్ర కథానాయిక సమంత విడాకులు, పెళ్లి గురించి ఎక్కువగా రూమర్స్ వస్తున్నాయి. కొద్దిరోజులు సమంత నుంచి ఎలాంటి అప్‌డేట్స్‌ రాకపోయినా కూడా ఎన్నో సంచలన పుకార్లు వచ్చాయి. తనకు స్కిన్ డిసీజ్‌ వచ్చిందని వార్తలు వచ్చాయి. ఇంకా ఇవే కాకుండా మరిన్ని నిరాధార రూమర్స్ క్రియేట్ అయ్యాయి. మళ్లీ ఇప్పుడు సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. దాంతో ఈ పుకార్లన్నీ ఒక్క సారిగా ఆగిపోయాయి. ఇప్పుడు ఆమె పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య సమంత ఒక టీ షర్ట్ ద్వారా ‘యూ విల్ నెవెర్ వాక్ అలోన్‌’ అనే ఒక సందేశం కూడా అందరికీ తెలియజేసింది. దాన్ని బట్టి ఆమె మళ్లీ వేరే వ్యక్తితో కలిసి తన జీవితాన్ని ప్రారంభించబోతోందని చాలామంది అర్థం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ఒక వార్త విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఆ వార్త ప్రకారం, సద్గురు జగ్గీ వాసుదేవ్ సమంతని రెండో పెళ్లి చేసుకోవాలని సూచించారు. సద్గురు మాటలను సమంత తల్లి బాగా సీరియస్‌గా తీసుకున్నారట. అందుకే సమంతని పెళ్లి చేసుకోమని బాగా ప్రెజర్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. సమంత కుటుంబానికి బంధువులైన ఒక అబ్బాయికి ఆస్తి కూడా ఎక్కువగానే ఉందట. ఆ అబ్బాయికి ఇచ్చి తన కూతుర్ని కట్టబెట్టాలని సమంత తల్లి బాగా ఆరాటపడుతోందట. కానీ సమంతనే ఆ సంబంధం వద్దంటూ సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇందుకు కారణం అతనికి ఆల్రెడీ ఫెయిల్ అయి విడాకులు కూడా అయ్యాయట. అలాంటి సంబంధం నచ్చకే సమంత కాదంటున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇదంతా కూడా కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కాబట్టి దీనిలో నిజమెంతో తెలియాలంటే సమంతనే నోరు విప్పాలి.

Share post:

Latest