కన్నడ చిత్ర పరిశ్రమల పవర్ స్టార్ గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ కన్నుమూసి సరిగ్గా ఏడాదికాలం అయ్యింది. కన్నడ దిగ్గజ నటుడు రాజ్ కుమార్ నట వారసుడుగా సినిమాల్లోకి అడుగుపెట్టిన పునీత్ రాజ్ కుమార్ తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా కన్నడ చిత్ర పరిశ్రమంలో పేరు తెచ్చుకున్నాడు. ఆయన సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ కూడా హీరో గాను తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు.. ఎన్నో అనాధాశ్రమాలు.. ఎందరో పిల్లలను చదివిస్తున్నారు. ఆయన చేసిన మంచి పనులను చెప్పుకోవాలంటే ఒక రోజు సరిపోదు.
అలాంటి గొప్ప మనిషి మరణించడం నిజంగా కర్ణాటక చేసుకున్న దురదృష్టం అనే అనుకోవాలి. ఆయనలాంటి గొప్ప మనిషి మళ్ళీ పుట్టడు పుట్టలేడు.. అలాంటి మంచి మనిషిని కర్ణాటక ప్రభుత్వం గుర్తిస్తూ కర్ణాటక రత్న అనే బిరుదుని పునీత్ రాజ్ కుమార్ గారికి ఇచ్చిందట.
అయితే ఈ బిరుదుని నంబర్ 1న కర్ణాటకలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇవ్వనుందాని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. ఈ సభకు సంబంధించిన కార్యక్రమాలు కూడా కర్ణాటక ప్రభుత్వం స్వయంగా పర్యవేక్షిస్తుంది.. ఈ కార్యక్రమంలో కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన వారితో పాటు.. మిగిలిన సినిమా ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలకి కూడా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆహ్వానించారని తెలుస్తుంది.
మన తెలుగు ఇండస్ట్రీ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం వచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి మీడియా సమక్షంలో స్వయంగా చెప్పారట. అలాగే తమిళ్ సినిమా పరిశ్రమ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ ని కూడా ఆహ్వానించారట. ఇలా అన్ని ఇండస్ట్రీ నుండి స్టార్ హీరోలు ఈ సభకు హాజరు కాబోతున్నారని తెలుస్తుంది. ఇంతమంది స్టార్ హీరోలు ఈ సభకు వస్తుండడంతో అభిమానులు కూడా భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున సెక్యూరిటీని కూడా గవర్నమెంట్ చాలా పటిష్టంగా ఏర్పాటు చేసిందట. పునీత్ రాజ్ కుమార్ గారితో ఎన్టీఆర్‌కు ఎంతో సాన్నిహిత్య సంబంధం ఉంది. అయన సినిమాలో ఎన్టీఆర్ పాట కూడా పాడారు. ఇక ఇప్పుడు ఆ సభలో ఎన్టీఆర్ పునీత్ రాజ్ కుమార్ గురించి ఏం మాట్లాడతారుని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.