వారేవా: నాని దసరా మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కేక పట్టించేశాడుగా..!

నాచురల్ స్టార్ నాని హీరోగా తెర‌కెక్కుతున్న కొత్త సినిమా దసరా. ఈ సినిమా పక్క మాస్ కమర్షియల్ యాక్షన్ సినిమాగా రూపొందుతుంది. ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ నటిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ న్యూస్ ఏమిటంటే ఈ సినిమా నుండి మొదటి లిరికల్ సాంగ్ ను ఈనెల మూడో తారీఖున విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. దీంతోపాటు ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ను కూడా మేకర్స్ లీక్ చేశారు. ఆ ఫోటోలో నాని పక్కా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.

Dasara Release Date: Nani and Keerthy Suresh's Film to Hit the Big Screens on March 30, 2023 (View Poster) | 🎥 LatestLY

కాగా ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ సినిమాలో నాని ఇప్పుటి వరకు ఎప్పుడూ చూడ‌ని మాస్ లుక్‌లో అభిమానులకు కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో నాని లోని మరో యాంగిల్ చూడడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చేరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 30 2023లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Share post:

Latest