హీరోగా కావలసిన నారా లోకేష్ .. అడ్డుకుంది ఎవరు..?

ఎంతోమంది సినీ తారలు సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్లి సక్సెస్ అయిన వారు ఉన్నారు ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఇండస్ట్రీ వచ్చి రాజకీయాలలోకి వెళ్లిన వారిలో సీనియర్ ఎన్టీఆర్, జయలలిత ,జయప్రద, చిరంజీవి ,పవన్ కళ్యాణ్, ఎంజిఆర్ తదితరులు ఉన్నారని చెప్పవచ్చు. ఇక వీరంతా సినిమాల్లోనే కాకుండా రాజకీయాలలో కూడా తమ హవా కొనసాగించారని చెప్పవచ్చు. అయితే సినీ తారలు అయినా సరే రాజకీయ నాయకులైనా సరే వారి పిల్లలను కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు.

Nara Lokesh Wishes 'Dear Tarak' On Jr NTR Birthday
అలాగే చంద్రబాబు నాయుడు తన కుమారుడైన నారా లోకేష్ ను కూడా రాజకీయాలలోకి తీసుకురావడం జరిగింది. రాజకీయ నాయకుడు కొడుకు నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. కానీ ఒకప్పుడు సినిమాలలో రాణించాలని పలు ప్రయత్నాలు చేశారట. అందుకోసం డైరెక్టర్ తేజ తో ఒక సినిమాని తెరకెక్కించాలనుకున్నారు. ఆ సమయంలోనే నితిన్ తో జయం సినిమాని చేసి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. అందువల్లే డైరెక్టర్ తేజ కి చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చారట. ఈ విషయానికి సంబంధించి అప్పట్లో ఒక మ్యాగజైన్ పోస్టర్ లో కూడా ప్రచురించడం జరిగింది. అందుకు సంబంధించి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.

అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా నిలిచిపోయింది.ఆ సమయంలోనే నిన్ను చూడాలని అనే సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంట్రీ ఇచ్చారట. దీంతో ఇక నారా లోకేష్ సినిమాల కంటే రాజకీయాల వైపు అడుగులు వేయాలని ఆలోచించి అటువైపుగా వెళ్ళినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఇప్పటికే రాజకీయ నాయకుడు గానే కొనసాగుతూ ఉన్నారు నారా లోకేష్.