దసరా ప్రి రిలీజ్ బిజినెస్…. నాని ముందు బిగ్ టార్గెట్‌…!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కన్నా ముందు నాని అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కాస్త నిరాశపరిచాడనే చెప్పాలి. ఈ సినిమాకి ముందే నాని శ్యామ్ సింగరాయ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు దసరా అనే మాస్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో నానికి జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమాలో మునుపెన్నడూ ఎప్పుడూ కనిపించిన విధంగా మాస్ లుక్ లో కనిపిస్తాడు.

Spark of #Dasara | Nani | Keerthy Suresh | Srikanth Odela | Sudhakar  Cherukuri - YouTube

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ సినిమాపై ఎంతో ఆసక్తి క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా విడుదలకు ముందే కొత్త రికార్డును క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ మొదలైంది. ఈ సినిమాకు డిజిటల్ మరియు హిందీ శాటిలైట్ ఆడియో రైట్స్ అన్ని రకాలుగా కలుపుకొని రు. 50 కోట్ల మేరకు భారీ స్థాయిలో బిజినెస్ చేసిందని తెలుస్తుంది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్ రు. 30 కోట్ల వరకు ఆఫర్ చేసిందట.

ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీగానే పలికాయి. రు. 20 కోట్లు శాటిలైట్ రైట్స్ పలికినట్టు తెలుస్తుంది. థియేట్రిక‌ల్ రైట్స్‌కు కూడా భారీ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ట‌. ఇలా ఇప్పటికే ఈ సినిమా భారీ బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలలో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బిజినెస్ చేసిందని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా నుండి ఒక మాస్ లిరికల్ సాంగ్ ను కూడా విడుదల చేయగా అది కూడా బాగా వైర‌ల్ అవుతోంది. ఏదేమైనా నాని ద‌స‌రాకు మంచి ప్రి రిలీజ్ బ‌జ్ అయితే వ‌చ్చేసింది.

Share post:

Latest