ఆ టైం లో తొంగి చూసిన నాగార్జున..చావ బాదిన నాగేశ్వరరావు..!?

సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి ఓ చెరగని ముద్రను వేసుకొచ్చాడు నాగేశ్వరరావు గారు. సినీ ఇండస్ట్రీని తనదైన స్టైల్ లో ఏలేసిన నాగేశ్వరరావు గారు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ అక్కినేని అనే పేరుని వినగానే చాలామంది నాగేశ్వరరావు గారిని గుర్తు చేసుకుంటారు . అంతటి క్రేజీ పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈయనకి .నాగేశ్వరరావు చాలా చలాకిగా సరదాగా ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే.

అయితే ఎంత సరదాగా ఉంటారో అంత స్ట్రిక్ట్ గా రూల్స్ పాటిస్తారు కూడా. ఎవరైనా పెద్దవారు వచ్చినప్పుడు గౌరవం ఇవ్వడం ..మంచి చెడు విషయాలను చెప్పడం అక్కినేని నాగేశ్వరరావు గారికి అలవాటు. ఈ క్రమంలోనే తన కొడుకుని చాలా పద్ధతిగా పెంచాలని అనుకున్నాడు, అదేవిధంగా కూడా పెంచారు. కానీ చిన్నతనంలో నాగార్జున తెలియక చేసిన తప్పుకు అక్కినేని నాగేశ్వరరావు చావబాదాడట . దీంతో ఆ తర్వాత ఆయనే బాధపడిపోయి నాగార్జున ను సముదాయించాడట. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..!!

పద్ధతికి మరో మారుపేరైన అక్కినేని నాగేశ్వరరావు గారు తన ఇంటికి ఎవరు వచ్చినా సరే అతిధి మర్యాదలతో సత్కారాలతో సాగనంపుతారు. అలాగే తనకు స్టోరీ చెప్పడానికి ఇంటికి వచ్చిన డైరెక్టర్ ఎవరు వచ్చినా సరే అలాగే చేస్తాడట నాగేశ్వరరావు . అంతేకాదు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటునప్పుడు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా ఉండడానికి ఓ రూమ్లో తలుపు క్లోజ్ చేసుకుని స్టోరీ వినే వాడ్ట. ఈ క్రమంలోని ఓ రోజు కథ చెప్పడానికి ఇంటికి వచ్చిన స్టార్ డైరెక్టర్ ని రూమ్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండగా ..ప్రతిసారి నాన్న లోపలికి వెళ్లి ఏం చేస్తున్నాడు అంటూ ఆ రూమ్ కిటికీ పైకి ఎక్కి నాగార్జున తొంగి చూశాడట . దీంతో నాగేశ్వరరావు కి పిచ్చ కోపం వచ్చిందట. నాగార్జున ని చూసి పడిపోతావురా దిగు అంటూ గట్టిగా అరిచారట . అంతేకాదు నాగార్జునని బయటికి వచ్చి గట్టిగా కొట్టారట. భయం లేదా నీకు ఇంకోసారి ఇలా చేస్తావా అంటూ ఫైర్ అయ్యారట. . ఇక ఆ తర్వాత కోపం తగ్గాక నాగేశ్వరరావు నాగార్జున దగ్గరికి వెళ్లి కూల్ చేసాడట.