వారెవ్వ: ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు..మళ్ళీ తెలుగు తెర పై మిస్టర్ పర్ఫెక్ట్ హీరోయిన్..!!

సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయాలోకం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు. ఇక్కడ కొడితే అక్కడ.. అక్కడ కొడితే మరోదగ్గర..బాల్ బూమ్ రాంగ్ అయ్యిన్నట్లు.. హీరోయిన్స్ కూడా ఆ ఇండస్ట్రీలో ఫ్లాప్ అయితే ఈ ఇండస్ట్రీలో.. ఈ ఇండస్ట్రీలో ఫ్లాప్ అయితే మరో ఇండస్ట్రీని మారుస్తూనే ఉంటారు . అంతే కానీ తమలో తప్పు ఉందని మాత్రం సరి పెట్టుకోరు. ఆ లిస్ట్ లోకే వస్తుంది ఢిల్లీ బ్యూటీ తాప్సి పన్ను.

తాప్సి ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసి మంచి హిట్లు తన ఖాతాలో వేసుకుంది. అయితే అందరి హీరోయిన్స్ లాగే తాప్సి కూడా అత్యాశకులోనై తెలుగులో మంచి పాపులారిటీ దక్కించుకుంది. తెలుగులో మంచి అవకాశాలు వస్తున్న రోజుల్లోనే బాలీవుడ్ కి చెక్కేసింది. బాలీవుడ్ లో కూడా కెరియర్ మొదట్లో మంచి అవకాశాలు అందుకుంది . కానీ రాను రాను బాలీవుడ్లో అమ్మడు వల్గర్ రోల్స్ , హాట్ రోల్స్, బెడ్ సీన్స్, లిప్ లాక్ చేస్తూ కేవలం వాటికే పరిమితమైంది . ఇప్పుడు బాలీవుడ్లో హాట్ రొమాంటిక్ సీన్స్ అంటే అందరికీ టక్కున గుర్తు వచ్చేది తాప్సీ నే. అంతలా తన పేరుని దిగజార్చుకుంది.

అంతేకాదు లేడీ ఓరియంటెడ్ రోల్స్ చేస్తూ కూడా హాట్ పెర్ఫార్మన్స్ లు ఇస్తుంది. కాగా ప్రజెంట్ తాప్సి గ్లామరస్ రోల్స్ లో నటిస్తూనే.. హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ కూడా చేసుకుంటూ లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న తాప్సి ..టాలీవుడ్ ని మర్చిపోయింది . అయితే రీసెంట్గా మాత్రం తాప్సి తన ఫేవరెట్ తెలుగు హీరో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది .మనకు తెలిసిందే మాస్ మహారాజా రవితేజ తాప్సి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి . వీళ్ల సినిమాలు ఫ్లాప్ అయినా సరే కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంది . ఈ క్రమంలోనే రవితేజ నెక్స్ట్ నటించబోయే సినిమాలో తాప్సి హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది . ఇన్నాళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్ ఎంట్రీ తో తాప్సి తన అభిమానులను మెప్పించబోతుంది అంటున్నారు జనాలు . కాగా తాప్సి, ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో పర్ఫెక్ట్ హీరోయిన్ గా నటించింది . ఇంకా పక్కాగా చెప్పాలంటే తాప్సి తన కెరియర్లో తెలుగులో అందుకున్న ఏకైక బ్లాక్ బస్టర్ హిట్ మిస్టర్ పర్ఫెక్ట్ అనే చెప్పాలి.