మహేష్ -త్రివిక్రమ్ సినిమాలో.. ఆ బాలీవుడ్ బడా విలన్..!

మహేష్ బాబు ప్రస్తుతం తన కొత్త సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో భాగంగా ఈ సినిమాలో మహేష్ కి విలన్ గా బాలీవుడ్ బడా హీరోని ఎంపిక చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఇక ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని కూడా తెలుస్తుంది.

SSMB28: Mahesh Babu Kickstarts Shooting for Trivikram Srinivas'  Directorial; Film Stars Pooja Hegde As Female Lead! | 🎥 LatestLY

ఆ పాత్ర కోసం బాలీవుడ్ బడా హీరో సంజయ్ దత్ అయితే బాగుంటుందని భావిస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే సంజయ్ దత్ కూడా సౌత్ సినిమాలపై కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఆయన మాట్లాడుతూ..” నేను సౌత్ సినిమాలలో నటించాలని కోరుకుంటున్నానని.. సౌత్ నుంచి ఏ దర్శకుడు నన్ను అప్రోచ్ అయినా కథ నచ్చితే కచ్చితంగా నటిస్తానని” సంజయ్ దత్ కామెంట్స్ చేశాడు.

Sanjay Dutt' to play corrupt politician in Mahesh-Trivikram's film? |  Telugu Movie News - Times of India

మహేష్ సినిమాలో విలన్ గా సంజయ్ దత్ నటిస్తుండంతో ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు కూడా క్రియేట్ అవుతాయి. ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ ఈ సినిమాలో తీసుకుంటున్న నటి నటుల విధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక మహేష్ త్రివిక్రమ్ కాంబోలో 11 సంవత్సరాలు తర్వాత మళ్లీ సినిమా వస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాను తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇక ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమాలో మహేష్ కు జోడిగా పూజ హెగ్డే నటించబోతుంది. ఈ సినిమా విడుదలై ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Share post:

Latest