బిగ్ షాకింగ్: ఊహించని చిక్కుల్లో ‘కాంతారా’.. చిత్ర బృందానికి లీగల్ నోటీసులు..!!

కాంతారా.. ఈ మధ్యకాలంలో ఈ సినిమా పేరు ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కోట్లు ఖర్చు చేసి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎలాంటి విజయం అందుకుందో ..అలా తక్కువ బడ్జెట్ లో వచ్చి సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న సినిమాగా కాంతారా సెన్సేషనల్ రికార్డును నెలకోల్పింది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి.. డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజ్ అయింది . ఎటువంటి అంచనాలు లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుంది .

విలేజ్ నేటివిటీకి దగ్గరగా ఉన్న కాన్సెప్ట్ కావడంతో జనాలు ఈ సినిమాని బాగా లైక్ చేశారు . ఈ క్రమంలోనే కన్నడ ప్రజలు సినిమాను విపరీతంగా ప్రమోట్ చేశారు . దీంతో ఈ సినిమా పెరౌ తెలుగు జనాల చెవిన పడింది. ఈ క్రమంలోనే కాంతారా ను క్యాష్ చేసుకున్న అల్లు అరవింద్ ఏకంగా రెండు కోట్లు ఖర్చు పెట్టి డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేశాడు . ఎవరు ఊహించిన విధంగా తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. గీత ఆర్ట్స్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసి అక్టోబర్ 15 గ్రాండ్గా సినిమా రిలీజ్ చేశారు. కాగా అటు హిందీ తమిళంలో కూడా విడుదలై ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది.

దీంతో చిత్ర బృందం ఫుల్ ఖుషి గా ఉన్న తరుణంలో బిగ్ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది . బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన కాంతారా సినిమాకు కొత్త చిక్కులు ఏర్పడ్డాయి. రీసెంట్గా ఈ చిత్రం నుంచి విడుదలైన వరాహ రూపం లిరికల్ వీడియో సాంగ్ వల్ల సమస్య ఏర్పడింది. ఈ మ్యూజిక్ తమదేనని కన్నడకు చెందిన ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ ‘తైక్కుడం బ్రిడ్జ్’ వారు ఆరోపించారు. గతంలోనే ఈ బ్యాండ్ లో ‘నవరసం’ ఆల్బమ్ వచ్చిందని తెలిపారు. దాన్ని కాపీ చేస్తూ ‘కాంతార’లో బాగాపాపులర్ అయిన ‘వరాహ రూపం’ సాంగ్ ఉందంటున్నారు. దాన్ని కాపీ చేస్తూ కాంతారా సినిమాలో వాడుకున్నారు అంటూ సదరు సంస్థ ఫైర్ అయింది. అంతేకాదు ఇది పూర్తిగా కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించడమే అంటూ మండిపడ్డారు . దీనిపై సరైన జవాబు ఇవ్వకపోతే త్వరలోనే చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఏదేమైనా సరే కన్నడ కాంతారా సినిమా ఇలా చిక్కుల్లో ఇరుక్కోవడం కొంచెం బాధ కలిగించే విషయం అని అంటున్నారు కన్నడ ప్రజలు.

 

View this post on Instagram

 

A post shared by Thaikkudam Bridge (@thaikkudambridge)