కేసీఆర్ రావొచ్చు.. కానీ.. ఏపీకి ఏం చెబుతారు..?

భార‌త రాష్ట్ర‌స‌మితి అధినేత.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. వ‌చ్చే నెల‌లో ఏపీలో అడుగు పెట్ట‌ను న్నారు. 2019లో తొలిసారి ఏపీ గ‌డ్డ‌పై అడుగు పెట్టిన కేసీఆర్‌.. అప్ప‌టి జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారో త్స‌వానికి హాజ‌రయ్యారు. త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఏపీవైపు రాలేదు. అయితే.. టీఆర్ ఎస్‌ జాతీయ పార్టీ బీఆర్ ఎస్‌గా అవ‌త‌రించిన నేప‌థ్యంలో ఏపీపైనా కేసీఆర్ దృష్టి పెట్టారు. మూడు ప్రాంతాల్లో ఆయ‌న బ‌హిరంగ స‌భ‌లు సైతం పెట్ట‌నున్నార‌ని.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు ఉప్పందిస్తున్నాయి.

వీటిలో విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఈ మూడు ప్రాంతాల్లోనూ.. బీఆర్ ఎస్ త‌ర‌ఫున ఆయ‌న ప్ర‌చారం చేయ‌నున్నార‌ట‌. ఓకే.. ఒక జాతీయ పార్టీ అధినేత‌గా కేసీఆర్ ఏపీలోకి రావ‌డా న్ని ఎవ‌రూ వ్య‌తిరేకించ‌రు. కానీ, బ‌హిరంగ వేదిక‌పై ఏపీకి సంబంధించి ఆయ‌న ఏం చెబుతారు? అనేది ఇప్పుడు కీల‌కంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ అనుస‌రించిన వ్యూహం ఏంటంటే.. ఏపీ క‌ష్టాలు ఏపీవి అనే! అంటే.. త‌న రాష్ట్రం తెలంగాణ ప్ర‌యోజ‌నాల వ‌ర‌కే.. ఆయ‌న ప‌రిమితం అయ్యారు.

KCR renames TRS as BRS, no launch of new party

కానీ, ఇప్పుడు ఒక జాతీయ పార్టీ సార‌థిగా.. కేసీఆర్‌.. ఏపీ అభివృద్ధికి కూడా పూచీ వ‌హించాల్సి ఉంటుంది . అదేస‌మ‌యంలో అప్పుల‌పైనా.. ఆయ‌న స్పందించాలి. రేపు ఇక్క‌డ తన వారికి ప్ర‌జ‌లు ఓట్లేయాలంటే.. ఏపీ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌కుండా.. కేంద్రం నుంచి ఏపీకి జ‌రుగుతున్న న‌ష్టాన్ని.. ప్రస్తావించ‌కుండా.. ముఖ్యంగా పోల‌వ‌రం, రాజ‌ధాని, ప్ర‌త్యేక హోదా వంటి అత్యంత కీల‌క‌మైన అంశాల‌ను ఆయ‌న మాట్లాడ కుండా.. ఎన్ని చెప్పినా.. అవి చెవిటి వాని ముందు శంఖం ఊదిన‌ట్టే అవుతుంద‌ని అంటున్నారు పరిశీ ల‌కులు.

ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ఏం చెబుతారు? ఏ స‌మ‌స్య‌ల‌పైనా.. ఏపీలో జ‌గ‌న్ పాల‌న‌పైనా.. ఆయ‌నెలాంటి అభిప్రాయం వ్య‌క్తం చేస్తారు?? అనేది ప్ర‌శ్న‌గాను ఉత్కంఠ‌గాను కూడా మారింది. ఈ క్ర‌మంలో కేసీఆర్ పెట్టే స‌భ‌ల‌పై స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది. కేవ‌లం సెటిల‌ర్ కుటుంబాలు టార్గెట్ చేసుకుని.. కొంద‌రిని త‌న పార్టీలో చేర్చుకుని చేతులు దులుపుకొంటే.. అది ఎలాంటి ప్ర‌యోజ‌నం ఇవ్వ‌ద‌ని కూడా ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఏదేమైనా ఏపీపై కేసీఆర్ వ్యూహం.. ఆయన వ‌చ్చి చేసే వ్యాఖ్య‌లు వంటి కీల‌కంగా మార‌నున్నాయ‌ని అంటున్నారు.

Share post:

Latest