ఆ టాలీవుడ్ హీరోకు న‌ర‌కం చూపించేసిన క‌త్రినా కైఫ్‌…!

బాలీవుడ్ సుందరి కత్రినా కైఫ్ 20 ఏళ్ల పాటు ఇండియ‌న్ సినిమాను ఊపేసింది. ముందుగా ఆమె బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినా త‌ర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఇక్క‌డ కూడా సినిమాలు చేసింది. క‌త్రినా ముందుగా తెలుగులో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా వ‌చ్చిన మ‌ల్లీశ్వ‌రి సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత బాల‌య్య‌కు జోడీగా అల్ల‌రి పిడుగు సినిమాలోనూ న‌టించింది.

Malliswari – Where Was It Shot

20 ఏళ్ల పాటు కంటిన్యూగా సినిమాల్లో న‌టించిన క‌త్రినా రీసెంట్ గా త‌న ప్రియుడు అయిన విక్కీ కౌశ‌ల్ ను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కౌశ‌ల్ వ‌య‌స్సులో క‌త్రినా కంటే యేడాదికి పైగా చిన్నోడు కావ‌డం విశేషం. తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్‌గా చేసిన‌ప్పుడు ఆ సినిమా నిర్మాత‌ సురేష్ బాబు కత్రీనా కైఫ్‌కి అప్పట్లోనే కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారట.

Katrina's Telugu debut opposite Venkatesh Daggubati

అయినా కూడా ఆమె రెమ్యున‌రేష‌న్ రింత ఎక్కువ కావాల‌ని.. త‌న‌కు, త‌నతో పాటు వ‌చ్చే వాళ్ల‌కు కూడా అద‌న‌పు సౌక‌ర్యాలు కావాల‌ని కండీష‌న్ పెట్టింద‌ట‌. ఇవి ఇవ్వ‌మ‌ని నిర్మాత‌లు చెప్ప‌డంతో షూటింగ్ కు స‌రిగా రాకుండా.. వ‌చ్చినా హీరోతో స‌రిగా కోప‌రేట్ చేయ‌కుండా హీరో వెంక‌టేష్ కు షూటింగ్‌లోనే చుక్క‌లు చూపించేసింద‌ట‌.

Katrina kaif's south connection, Vicky Kaushal's future wife chemistry with Drishyam 2's Venkatesh - The Post Reader

క‌త్రినా తీరుతో వెంక‌టేష్ కూడా ఒకానొక ద‌శ‌లో విసిగిపోయాడ‌ట‌. అయితే చివ‌ర‌కు సినిమా ఎక్క‌డ ఆగిపోతుందో అని సురేష్ బాబు ఆమె అడిగిన‌వి అన్ని ఇచ్చి ఎలాగోలా ఆ సినిమాను పూర్తి చేయించార‌ట‌. ఈ విష‌యం అప్ప‌ట్లో టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

Share post:

Latest