అది పెద్దగా ఉన్న మగ్గాళ్ళు.. ఆడవారిని పశువుల్లా చూస్తారు..స్టార్ కోడలు సంచలన కామెంట్స్..!?

రోజులు మారుతున్నాయి ..టెక్నాలజీ పెరిగిపోతుంది.. మారుతున్న కాలానికి పెరుగుతున్న టెక్నాలజీకి జనాలు కూడా మారుతున్నారు. అయితే మొబైల్ ఫోన్ లో ప్రపంచం మొత్తం చూస్తున్న ఈ జనరేషన్ లోను ఇంకా ఆడపిల్లపై క్రూరంగా ప్రవర్తించే మగాళ్లు ఉన్నారా ..? అంటే అవుననే చెప్పాలి . సిటీస్ లో పరిస్థితి వేరు భర్త ఒక దెబ్బ కొడితే రెండు దెబ్బలేసే భార్యలు ఉన్నారు. అయితే మారుమూల పల్లెటూరులో మాత్రం ఇప్పటికీ ఆడవాళ్ళని హింసిస్తూనే ఉన్నారు కొందరు మగాళ్లు. వాళ్లపై శారీరక హింసకు పాల్పడుతూనే ఉన్నారు. ఆడది అంటే కేవలం ఆట బొమ్మగా చూసే మగాళ్లు ఇంకా ఈ జనరేషన్ లో మనం బతుకుతున్న ఈ ఈ సొసైటీ లోనే ఉన్నారు.

అలాంటి రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఓ స్టోరీ రాసుకొచ్చింది కనిక తిల్లాన్. ఈ పేరు చెప్తే పెద్దగా జనాలకు గుర్తుపట్టలేకపోవచ్చు . కానీ మన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాజీ కోడలు అని చెప్తే గుర్తుపడతారు . అదేనండి అనుష్క శెట్టితో సైజ్ జీరో అనే సినిమాను తీసి బొక్క బోర్లా పడ్డారే.. ఆ డైరెక్టర్ ప్రకాష్ కోవెలమూడి మాజీ భార్య ఈ కనిక తిల్లాన్. పెద్దల సమక్షంలో ఒక్కటైన ఈ జంట 2017 లో విడాకులు తీసుకుని విడిపోయారు. కనిక తిల్లాన్ ఫేమస్ రచయిత్రి. బాలీవుడ్లో ఆమె ఎన్నో సినిమాలకు కధలు అందించింది .

రీసెంట్గా అక్షయ్ కుమార్ నటించిన రక్షాబంధన్ సినిమాకు కధ అందించింది ఆమెనే. ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వనప్పటికీ చాలామంది మహిళలకు క్లోజ్ గా కనెక్ట్ అయింది. ఈ సినిమాలో రియాలిటీని చూపించి సాహసం చేశారు డైరెక్టర్ . చెల్లెళ్లకు పెళ్లి చేయడం కోసం అన్నయ్య పడే తపన ..చెల్లెలును కాపాడుకోవడానికి అతను చూపించే కోపం జనాలకు బాగా నచ్చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కనిక సంచలన కామెంట్స్ చేసింది.

“నేను ఈ సినిమా కథను రాసుకునేటప్పుడు సిటీ లో నివసించే అమ్మాయిల గురించి ఊహించుకొని రాయలేదు. మారుమూల గ్రామంలో నివసించే ఆడపిల్లలు.. మగాళ్ళ కోపానికి బలైపోతున్న స్త్రీల గురించి ఆలోచించాను. భారతదేశంలో వరకట్న మరణాలపై అధికారిక గణాంకాలకు ఈ చిత్రం ప్రతిబింబంగా తెరకెక్కించాం. నిజంగా ఈ సినిమాలో అక్షయ్ కుమార్ చాలా బాగా నటించారు . అంతేకాదు నేను మగాడిని అనే అహంకారం ఎక్కువుగా ఉన్న అబ్బాయిలు.. ఇప్పటికీ స్త్రీలను పశువుల్లా చూసే జనాలు మన మధ్యనే ఉన్నారు. ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలంటే సన్నగా నాచుక్క అందంగా ఉండాలి. భర్త చెప్పిందే వినాలి..వాడు ఎలాంటి వాడైన ..ఆడదానికి ఇష్టం లేకపోయిన ..వాడు చెప్పే పనులు చేయాలి.. ఆ పొగరు ఉన్న మగాళ్ళను ఎవరు మార్చలేరు “అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.