రామ్ వెనకే భీమ్ జపాన్ బయల్దేరాడు.. పిక్స్ వైరల్..!

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ -ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఈ సినిమాలతో వీళ్ళిద్దరూ పాన్ ఇండియా హీరోలు గా మారిపోయారు.

ఈ సినిమా ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాలలో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా ఓటీటీలో కూడా భారీ స్థాయిలో వ్యూస్ ను దక్కించుకుంటుంది.

ఇప్పుడు ఈ సినిమాని ఈనెల 21న జపాన్ లో విడుదల చేయడానికి సినిమా యూనిట్ సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈరోజు ఉదయం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్యతో కలిసి జపాన్ బయలుదేరిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తన భార్యతో కలిసి జపాన్ వెళ్లేందుకు ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతటి ఘనవిజయం అందుకున్న త్రిబుల్ ఆర్ జపాన్ లో ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.

Share post:

Latest