సీనియర్లకు సీటు లేదా..జగన్ షాక్ ఎవరికి..!

ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం సరిగ్గా నిర్వహించని వారికి జగన్ క్లాస్ పీకిన విషయం తెలిసిందే..ఇకనుంచైనా కార్యక్రమం ద్వారా గడపగడపకు వెళ్లాలని..లేదంటే నెక్స్ట్ సీటు కూడా ఇవ్వనని తేల్చి చెప్పేశారు. అయితే గడపగడకు వెళ్లకపోతే సీటు ఇవ్వకుండా ఉంటారా? అబ్బో కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే గడపగడపకు తక్కువ సమయం వెళ్ళిన వారిలో సీనియర్లు ఎక్కువ ఉన్నారు..అందులో జగన్‌కు అత్యంత సన్నిహితులే ఉన్నారు. వారికి సీటు ఇవ్వకుండా ఉండటమనేది చాలా కష్టమైన పని.

ఒకసారి తక్కువ రోజులు గడపగడపకు వెళ్ళిన వారిలో దాదాపు 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని..వైసీపీ వర్క్ షాప్ రోజే జగన్ క్లారిటీ ఇచ్చేశారు. అందులో కొందరు సీనియర్లు ఉన్నారు. అమలాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పినిపే విశ్వరూప్ కేవలం 2 రోజులు గడపగడపకు వెళ్లారు. ఈయన అనారోగ్యంతో తిరగలేదు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..కింద నుంచి సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. మూడో ప్లేస్‌లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, నాలుగో ప్లేస్‌లో ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ఉన్నారు. ఇలా చూసుకుంటే గ్రంథి శ్రీనివాస్, మేడా మల్లిఖార్జున్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆళ్ళ నాని, రోజా,  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి..ఇలా పలువురు సీనియర్లు ఉన్నారు.

మరి వీరంధరికి సీటు ఇవ్వకపోవడం సాధ్యం అవుతుందా? అంటే అసలు సాధ్యం కాదు. పైగా గడపగడపకు వెళ్లనంత మాత్రాన..వీరిపై నెగిటివ్ ఉంటుందనేది చెప్పడానికి లేదు. ఎందుకంటే ఉదాహరణకు చెవిరెడ్డిని తీసుకుంటే ఆయనకు చంద్రగిరిలో తిరుగులేదు. డౌట్ లేకుండా మళ్ళీ గెలిచేస్తారు. ఇక ఆయన తిరగకపోయినా..ఆయన టీంని ప్రజల్లో తిప్పుతారు. కాబట్టి గడపగడపకు తిరగని వారికి సీటు ఇవ్వకపోవడం అనేది జరిగే పని కాదు. ఓవరాల్‌గా ప్రజా వ్యతిరేకత ఉన్నవారికి సీటు డౌట్ గాని..మిగతా వారికి ఇబ్బంది ఉండదు.