అప్పుడు ఆ స్టార్ కొడుకు..ఇప్పుడు ఈ స్టార్ కొడుకు.. సీతారామం డైరెక్టర్ రూటే వేరబ్బ..!?

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు హ‌నురాఘ‌వ‌పూడి. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నడు ఈ దర్శకుడు. ఆత‌ర్వ‌తా వెంట‌నే రెండో సినిమాగా న్యాచురల్ స్టార్ నానితో కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమా తీసి నాని కెరియ‌ర్ లోనే అదిరిపోయే హిట్ ఇచ్చాడు. ఇలా మొదటి రెండు సినిమాలు తోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ దర్శకుడు… తన తర్వాతి సినిమాలతో కాస్త నిరాశపరిచాడు అనే చెప్పాలి.

I Didn't Spoil Sita Ramam Second Half: Hanu Raghavapudi

తాజాగా హను రాఘవపూడి సీతారామం సినిమాను క్లీన్ క్లాసిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కించాడు. ఈ సినిమా ఆగస్టులో విడుదలై హను రాఘవపూడికి కంబ్యాక్ హిట్ ఇచ్చింది. ఈ సినిమాలో హీరోగా మలయాళీ మెగాస్టార్ ముమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ ని హీరోగా తీసుకున్నాడు, అతనికి జంటగా ముంబై బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. ఈ సినిమా ద్వారా దూల్కర్ సల్మాన్ కి తెలుగులో అదిరిపోయే హిట్ వచ్చింది. అయితే ఇప్పుడు హను రాఘవపూడి తన తర్వాత సినిమాను మరో స్టార్ హీరో కొడుకుతో చేయబోతున్నట్టు తెలుస్తుంది.

హ‌నురాఘ‌వ‌డి తాజాగా వచ్చిన సినిమాను మలయాళీ మెగాస్టార్ ముమ్ముట్టి కొడుకుతో తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు మళ్లీ అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున పెద్దకొడుకు నాగచైతన్యతో తన తర్వాతి సినిమా చేయబోతున్నాడు. అయితే నాగచైతన్య ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలు పూర్తయిన వెంటనే హను రాఘవపూడి సినిమాలో నటించబోతున్నాడని తెలుస్తుంది. ఈ విషయంపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Share post:

Latest