‘గాడ్ ఫాదర్’ ఎక్స్ క్లూజివ్: ఖచ్చితంగా సినిమాని చూడడానికి గల ప్రధాన 5 కారణాలు ఇవే..!!

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన “గాడ్ ఫాదర్” సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. దసరా కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్ గా సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేశారు చిత్ర బృందం. దీంతో మెగా ఫాన్స్ కు మరో పండగ అనే చెప్పాలి . గాడ్ ఫాదర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి నటనకు మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు . మెగా ఫ్యాన్స్ కొందరు మెగా ఫ్యాన్స్ మెగాస్టార్ కి ఇదే రియల్ కం బ్యాక్ ఫిలిం అంటూ పొగిడేస్తున్నారు. మనకు తెలిసిందే మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన “లూసిఫర్” సినిమాకి ఇది రీమిక్స్. మోహన్ రాజా తనదైన స్టైల్ లో తెరకెక్కించాడు. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ ప్రధాన పాత్రలు పోషించి సినిమాకు మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచారు. ఇక మెగా ఫాన్స్ అయితే ఈ సినిమాను తప్పకుండా అందరూ సినిమా థియేటర్స్ లోనే చూడండి అంటూ ప్రమోట్ చేస్తున్నారు. అసలు ఎందుకు గాడ్ ఫాదర్ సినిమా మనం చూడాలి అనడానికి ఐదు ప్రధాన కారణాలను ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం రండి..!!

1) మనకు తెలిసిందే గాడ్ ఫాదర్ సినిమా మలయాళ “లూసిఫర్” కి రీమేక్. ఎవరైనా సరే ఈ సినిమాను చూసిన తర్వాత రీమేక్ నే కదా అని అదే స్టోరీ అంటూ కొట్టి పడేస్తారు. అయితే అది అబద్ధం. ఈ సినిమా విషయంలో మోహన్ రాజా క్లియర్ గా తన డైరెక్షన్ స్టైల్ ను చూయించాడు. ఎక్కడ లూసిఫర్ కి, గాడ్ ఫాదర్ కి సింక్ అవ్వకుండా ..తన ఓన్ స్టైల్ ను బయటకు తీసుకొచ్చాడు. సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికి ఇదే ప్లస్ పాయింట్.

2) చిరంజీవి నటన ఈ సినిమాకి ప్లస్ పాయింట్. చిరంజీవి మరోసారి తనలోని నటుడిని బయటపెట్టాడు. అఫ్ కోర్స్ చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150 నే అయినా.. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ మెగాస్టార్ స్థాయిని రీచ్ కాలేకపోయాయి . పర్ఫామెన్స్ వైస్ గా కూడా మెగాస్టార్ కి అంత స్కోప్ లేదు. కానీ ఈ సినిమాలో మెగాస్టార్ పూర్తిస్థాయి నటనను కనబరిచాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే బాస్ ఈజ్ బ్యాక్ అంతే. సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికి ఇది ఓ కారణం

3)చిరంజీవి సినిమా అనగానే మనం ఎక్స్పెక్ట్ చేసేది రొమాన్స్, పాటలు, డాన్స్ , డైలాగ్స్.. హీరోయిన్ తో కెమిస్ట్రీ అయితే.. ఈ సినిమాలో హీరోయిన్ లేదు. సింగిల్ హీరోగా చిరంజీవి మొదటిసారి మెగా ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు . దీంతో ఫాన్స్ కూడా భయపడ్డారు. హీరోయిన్ లేకుండా మెగాస్టార్ ఎలా నెట్టుకు రాగలరు అంటూ ఆలోచించారు . అయితే ఫస్ట్ షో పడగానే అవన్నీ క్లియర్ కట్ గా తుడుచుకుపెట్టుకుపోయాయి. సినిమాలో హీరోయిన్ లేకపోయినా సరే చిరంజీవి ఎక్కడ ఆ లోటును తెలిసేలా చేయలేదు. తనదైన స్టైల్ లో కామెడీ చేస్తూనే ..ఎమోషన్స్ పండిస్తూనే.. అదిరిపోయే డైలాగ్స్ తో నేటి పొలిటికల్ లీడర్స్ కి పరోక్షంగా పంచులు విసిరి పాలిటిక్స్ లో అసలు మర్మాలను బయటకు తీసుకొచ్చాడు. సినిమా జనాలకు నచ్చడానికి ఇది కూడా మరో కారణం.

4)మోహన్ రాజా ఈయన తెలుగు సినిమాతోనే తన డైరెక్షన్ ని ప్రారంభించాడు. 2001లో వచ్చిన హనుమాన్ జంక్షన్ ను తనదైన స్టైల్ లో తెరకెక్కించాడు. ఆశ్చర్యమేంటంటే ఈ సినిమా కూడా రీమేక్ నే అయినా కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్నో రికార్డును కొల్లగొట్టింది . అదేవిధంగా తీసుకొని గాడ్ ఫాదర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు అనగానే మెగా అభిమానుల్లో భయం మొదలైంది . రీమేక్ అనే పదం వింటేనే జనాలకు చిరెత్తిపోతుంది ఈ మధ్యకాలంలో. కానీ అలాంటి తప్పు చేయకుండా గాడ్ ఫాదర్ సినిమా చూసిన జనాలకు లూసిఫర్ సినిమా గుర్తు రాకుండా తనదైన స్టైల్ లో మసాలాలు దట్టించి ..అక్కడక్కడ చిరంజీవి పొలిటికల్ బేస్ ను వాడుకుంటూ మెగా ఫాన్స్ కి అటు నటన పరంగా ఇటు పొలిటికల్ పరంగా రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ మెప్పించాడు.

5)లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నయనతార సత్యదేవ్. ఈ సినిమాకి చిరంజీవి తర్వాత బిగ్గెస్ట్ హైలెట్గా నిలిచింది ఎవరు అంటే కచ్చితంగా చెప్పుకోవాల్సింది మనం నయనతార ,సత్యదేవ్. నయనతార రోల్ చిన్నది అయినప్పటికీ తన కళ్ళతోనే ఎక్స్ప్రెషన్స్ పలికించి హీరోయిన్ లేని లోటును తీర్చేసింది. ఇక మోహన్ రాజా విలన్ కోసం ఎవరో నార్త్ వాళ్లను పెట్టకుండా మన తెలుగు అబ్బాయిని సత్యదేవ్ ని విలన్ గా పెట్టి మంచి పని చేశాడు. మన వాళ్ళల్లో టాలెంట్ ఉంది మనవాళ్లకు కూడా నటించగలరు అంటూ ప్రూవ్ చేశారు. ఈ సినిమాలో సత్యదేవ్ జీవించేసాడు .కచ్చితంగా ఈ సినిమా ఆయన కెరియర్ లోనే బ్లాక్బస్టర్ హీట్ అవుతుంది. మరెందుకు ఆలస్యం త్వరగా మీ ఇంటికి దగ్గరగా ఉన్న థియేటర్స్ లో టికెట్స్ బుక్ చేసుకుని గాడ్ ఫాదర్ సినిమాను ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ దసరా ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేసుకోండి..!!