చిరంజీవి కోసం గెటప్ శ్రీను షాకింగ్ నిర్ణయం.. నిజమైన ఫ్యాన్ అంటే నువ్వే రా..!?

సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉండే పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. తనదైన స్టైల్ లో నార్మల్ హీరో నుంచి మెగాస్టార్ వరకు ఎదిగాడు. చిరంజీవి పేరు చెప్పుకునే సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు . మరి ముఖ్యంగా కొందరు ఆర్టిస్టులు అయితే చిరంజీవిని ఒక్కసారైనా దగ్గర నుంచి చూస్తే చాలు మా జన్మ ధన్యం అనుకునే నటులు ఇప్పటికి సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే గెటప్ శ్రీను.

జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన గెటప్ శీను.. ఆ షోలో తనదైన స్టైల్ లో లేడీ గెటప్స్ వేసి రకరకాల అయిన గెటప్స్ తో జనాలను కడుపుబ్బ నవ్వించారు. సుడిగాలి సుధీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీను ఫ్రెండ్ షిప్ ఎలాంటిదో మనకు తెలిసిందే. ఈ ముగ్గురు కలిసి స్కిట్ వేశారంటే పొట్ట చెక్కలయ్యే విధంగా నవ్వాల్సిందే. అలాంటి ఓ క్రేజీ హిట్ ఫ్రెండ్షిప్ ని ఫామ్ చేసుకున్నారు ఈ ముగ్గురు. కాగా ఈ ముగ్గురిలో అందరికన్నా ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ ఎవరు అంటే కచ్చితంగా గెటప్ శ్రీను. ఎందుకంటే రకరకాల అయిన గెటప్స్ వేసి ఎలాంటి గెటప్ వేసిన ఆ గెటప్ లో లీనం అయిపోయినట్టే నటించే ఇతడు అంటే చాలామందికి ఇష్టం.

అందుకే కాబోలు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆయనకు తన సినిమాలో అవకాశం ఇచ్చి సినిమా ఇండస్ట్రీలో ఆయన ఎదుగుదలకు ప్రోత్సహించారు. మెగాస్టార్ చిరంజీవితో గెటప్ శ్రీను “గాడ్ ఫాదర్” అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏకంగా తన ప్రైవేట్ జెట్ ప్లేన్ లోనే గెటప్ శ్రీను ను తీసుకెళ్లారు. అంత మంచి మనసు ఉంది చిరంజీవికి. కాగా గెటప్ శ్రీనుకు చిరంజీవి మరో బ్లాక్ బస్టర్ అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది . తన తదుపరి సినిమాలో కూడా గెటప్ శ్రీనుకు అవకాశం ఇచ్చారట మెగాస్టార్ చిరంజీవి.

ఈ క్రమంలోనే ఆయన కొన్ని రోజుల పాటు విదేశాలలో ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే గెటప్ శ్రీను మరోసారి జబర్దస్త్ కు బ్రేక్ వేయాలని ఆలోచిస్తున్నారట .నిజానికి ఆల్ రెడీ గెటప్ శ్రీను ఓసారి జబర్దస్త్ కి దూరమయ్యారు. ఆ తర్వాత బెదిరించారో బతిమాలుకున్నాడో.. జబర్దస్త్ లోకి మళ్ళీ రిఎంట్రీ ఇచ్చాడు. అయితే వచ్చిన కొద్ది రోజులకే మళ్లీ జబర్దస్త్ బ్రేక్ వేయడం అంటే అది మామూలు విషయం కాదు. కానీ చిరంజీవితో నటించడం కోసం గెటప్ శ్రీను షాకింగ్ నిర్ణయం తీసుకొని జనాల చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే నిజమైన ఫ్యాన్ అంటే నువ్వేరా అంటూ పొగిడేస్తున్నారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి, గెటప్న్ శ్రీను పేర్లు సోషల్ మీడియాలో మారు మ్రోగిపోతున్నాయి.

Share post:

Latest