కెరీర్ లోనే ఫస్ట్ టైం అలా..ఆ హీరోను నమ్మి నిండా మోసపోయిన కీర్తి సురేష్..!?

సినీ ఇండస్ట్రీ అంటేనే మాయా లోకం ..ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు ..ఎంత పెద్ద హీరో అయినా సరే కొన్ని కొన్ని సార్లు పప్పులో కాలు వేయాల్సిందే. ఇలాంటి విషయాల్లో హీరోయిన్స్ కూడా అతీతం కాదు .స్టార్ హీరోయిన్గా స్టేటస్ సంపాదించుకున్నా కానీ కొందరు డైరెక్టర్స్ మాటలు విని నమ్మి మోసపోయిన హీరోయిన్స్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఆ లిస్టులో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ హీరోయిన్ గా చెప్పుకోవాల్సిన అమ్మడు కీర్తి సురేష్. పాపం కీర్తి సురేష్ అమాయకత్వమో లేక దురదృష్టమో తెలియదు కానీ..ప్రతి డైరెక్టర్ చెప్పింది నమ్మి..ఆ సినిమాలకు కమిట్ అయ్యి.. ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

“నేను శైలజ” అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ ..ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు అందుకుంది ఇక ఆ తర్వాత వచ్చిన అవకాశాలల్లో నచ్చిన వి చూస్ చేసుకుంటూ..మంచి నటనను ప్రదర్శించి తన లోని నటికీ మంచి మార్కులు వేయించుకుంది. ఇక తర్వాత ఇండస్ట్రీలో ఒక్కొక్క సినిమాను సైన్ చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చింది . అదృష్టం బాగుండి మహానటి సినిమాలో నిత్యామీనన్ సైన్ చేసి తప్పుకోవడం.. ఆ పాత్రలో కీర్తి సురేష్ రావడం.. జనాలను కీర్తి సురేష్ ఆకట్టుకోవడం.. చక చక జరిగిపోయాయి . ” మహానటి” సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ ఏళ్లు గడుస్తున్న ఇంకా ఆమెను మహానటి గానే పిలుస్తున్నారు జనాలు.. అంటే ఆ సినిమా ద్వారా కీర్తి సురేష్ ఎంత పేరు సంపాదించుకుందో మనం అర్థం చేసుకోవచ్చు.

అయినా కానీ ఏం లాభం మహానటి సినిమా తర్వాత ఇప్పటివరకు కీర్తి సురేష్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ ఒక్కటి కూడా పడలేదు . సర్కారు వారి పాట హిట్ అయినా కానీ అది మొత్తం మహేష్ ఖాతాలోకి వెళ్లిపోయింది.అయితే కీర్తి సురేష్ ఓ స్టార్ హీరోని నమ్మి నిలువునా మునిగిపోయింది అనే న్యూస్ ఇండస్ట్రీలో అప్పట్లో వైరల్ గా మారింది . ఆ హీరో మరెవరో కాదు కోలీవుడ్ లెజెండ్ స్టార్ హీరో రజనీకాంత్ . మనకు తెలిసిందే రజనీకాంత్ హీరోగా నటించిన “పెద్దన్న ” సినిమాలో కీర్తి సురేష్ చెల్లి పాత్రలో నటించింది.

నిజానికి ఈ సినిమా పై కీర్తి సురేష్ బోలెడన్ని ఆశలు పెట్టుకుని ఉండిందట. అంతేకాదు ఈ సినిమా కోసం భారీ ఆఫర్స్ ని కూడా వదులు కున్నిందట. కచ్చితంగా రజనీకాంత్ సినిమా హిట్ అవుతుందన్న ధీమాతో అమ్మడు బోలెడన్ని బిగ్ ఆఫర్స్ వదులుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఏం లాభం తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అంటూ కీర్తి సురేష్ నటించిన పెద్దన్న సినిమా పరమ చెత్త టాక్ ను సంపాదించుకుంది . అంతేకాదు కీర్తి సురేష్ వదిలేసిన ప్రతి సినిమా హిట్ అయింది. దీంతో కీర్తి కెరీర్ ఇబ్బందుల్లో పడింది..!!

Share post:

Latest